జాతస్య మరణం ధ్రువం. దీని అర్ధం అందరికి తెలుసు అనుకుంటాను. ఒక వేళ తెలియకుంటే దీని అర్ధం ఏంటంటే.. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు అని భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకం.. కానీ కరోనా వచ్చాక మరణాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. ఇలా మాత్రం చనిపో కూడదు అని అనుకునేలా పరిస్దితులు మారాయి.. ఎందుకంటే నిత్యం వలస కూలీల మరణాలు ఎక్కడో ఒకచోట సంభవిస్తూనే ఉన్నాయి.. వారి చావుగురించిన వివరాలు తెలుసుకుంటే మనసు చలించడమే కాదు.. దేవుని పై కోపం కూడా వస్తుంది.. ఇకపోతే తాజాగా నిద్రాహారాలు లేక ఫ్లాట్‌ఫామ్‌పైనే ప్రాణాలు వదిలిన బిహార్‌ మహిళా వలస కూలీ ఘటన గురించి మరిచిపోక ముందే ఝాన్సీ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.  

 

 

ముంబైకి బ్రతుకుదెరువు కోసం వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరుగు పయనమయ్యే క్రమంలో ప్రాణాలు విడిచాడు. మరో 70 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇల్లు చేరుతాననగా విధి వక్రీకరించి ప్రాణాలు కోల్పోయాడు.. ఆ వివరాలు చూస్తే.. బస్తీ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మోహన్‌ లాల్‌ శర్మ ముంబైలో రోజూవారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అనుకోకుండా కరోనా రావడం, లాక్‌డౌన్‌ విధించడంతో అందరిలాగే అతని పరిస్థితి కూడా చాలా దుర్భరంగా తయారైంది. దీంతో బ్రతుకు జీవుడా అంటూ శ్రామిక్‌ రైలులో ఇంటికి బయల్దేరి, మే 23న ఝాన్సీకి చేరుకున్నాడు. అయితే ఝాన్సీ జిల్లా యంత్రాంగం శ్రామిక్‌ రైలులో వచ్చినవారిని ఆయా ప్రాంతాలకు వెళ్లే స్థానిక రైళ్లలో పంపించింది. ఈ క్రమంలో శర్మ కూడా మరో 70 కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తే, సుమారుగా, గంటా గంటన్నరలో తన ఊరికి చేరిపోయే వాడు.. కానీ, అతనొకటి తలిస్తే విధి మరోటి తలచింది.

 

 

ఈ దశలో అతను ప్రయాణించిన రైలు గోరఖ్‌పూర్‌లో ప్రయాణికులను దించి మే 27న తిరిగి ఝాన్సీకి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం రైల్వే కోచ్‌లు శుభ్రం చేస్తున్న క్లీనింగ్‌ సిబ్బంది రైలు టాయ్‌లెట్‌లో శర్మ శవం చూసి షాకయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, అధికారులు వెంటనే శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత శర్మ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: