మహానాడు మీటింగ్‌లో ఎక్కువ సమయం అధికార పార్టీని విమర్శించడానికి కేటాయించినా అక్కడక్కడా చంద్రబాబు ఆత్మ పరిశీలన కూడా చేసుకున్నారు. ఏడాది క్రితం జరిగిన ఘోర పరాజయానికి కారణాలు గురించి కూడా కొద్దిసేపు మహానాడులో చర్చించారు. ముఖ్యమంగా బీసీలు, దళితులు కొన్ని కారణాలతో మనకు దూరమయ్యారని..ఇకపై వారిని కూడా కలుపుకుపోవాలని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.

 

 

అయితే చంద్రబాబులోని ఈ పరివర్తనను వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. చంద్రబాబు గతంలో తోకలు కత్తిరిస్తా.. తాట తీస్తా.. అని చంద్రబాబు కించపరిచాడని గుర్తుచేస్తోంది. అందుకే టీడీపీని బీసీలు ఎప్పటికీ క్షమించరని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అంటున్నారు. ఐదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అడుగడుగునా అణచివేయాలని చూసిన చంద్రబాబు.. అధికారం కోల్పోయాక ఈ వర్గాలపై కపట ప్రేమ చూపిస్తున్నాడని మండిపడుతున్నారు.

 

 

 

మహానేడు వేదికగా బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని, ఎన్ని కుయుక్తులు పన్నినా బలహీనవర్గాలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని పార్థసారధి అంటున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి బలహీనవర్గాలకు పెద్దపీట వేశారని ఆయన అంటున్నారు. ఓడిపోయినప్పుడల్లా బీసీలపై కపట ప్రేమ చూపించే చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి కనీసం రూ.5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు.

 

 

 

అంతే కాదు.. చంద్రబాబు బీసీల గురించి ఆదరణ పథకం అని పెట్టి బీసీలకు ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు ఇచ్చి బలహీనవర్గాలను అభివృద్ధి చేశానని చెప్పుకున్నారని విమర్శించారు. బలహీనవర్గాల ప్రజలు తమ న్యాయమైన హక్కుల కోసం చంద్రబాబు దగ్గరకు వెళ్తే వారిని అవమానించే రీతిలో ప్రవర్తించాడని, నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారుల తోలుతీస్తానని, యాదవ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరిన యువతను 24 గంటలు జైల్లో పెట్టి అవమానించాడని చంద్రబాబు పాత చరిత్రను గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: