లాక్ డౌన్ నిబంధనలు సడలింపు, కొనసాగింపుపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మార్చి 24 వ తేదీ నుంచి సుదీర్ఘంగా నిబంధనలు అమలు అవుతున్నాయి. ప్రస్తుతం నాలుగో విడత లాక్ డౌన్ అమలవుతోంది. 3 ,4 లాక్ డౌన్ లో కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తూ వచ్చింది. అయితే ఇక ఐదో విడత లాక్ డౌన్ లో కేంద్రం ఏ సడలింపులు ఇస్తుంది ? అసలు దీనిపై కేంద్రం అసలు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ కేసుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ 5 .0 లో కేవలం 11 కరోనా ప్రభావిత నగరాల్లో మాత్రమే నిబంధనలు కఠినంగా అమలు చేస్తారని, కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. 


మిగతా చోట్ల పూర్తిగా సడలింపులు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. కంటోన్మెంట్ జోన్ లలో నిబంధనలు విధించడంతో పాటు, ఢిల్లీ మెట్రో తో సహా ,రెస్టారెంట్లు వంటివి తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లాక్ డౌన్ 5.0 లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, కోల్ కతా, నగరాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక లాక్ డౌన్ 5 .0 లో కేంద్రం తమ మీద అ ఏవిధమైన భారం పెట్టుకోకుండా, పూర్తిగా రాష్ట్రాలకే లాక్ డౌన్  నిబంధనలు విధించే అవకాశాన్ని కల్పించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 


ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కేంద్రం అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా లాక్ డౌన్ పొడిగింపు, నిబంధనల సడలింపు తదితర అంశాలపై విడివిడిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించినట్లు సమాచారం. అందరి అభిప్రాయాలను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రం రేపు ప్రకటన చేయబోతోంది. కేంద్రం లెక్కల ప్రకారం ఇక లాక్ డౌన్ అమలు, నిబంధనల సడలింపు వంటి అన్ని విషయాల పైన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కట్టబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే లాక్ డౌన్ 5.0 లో భారీ సడలింపులు ఉండేలా నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: