ప్రపంచాన్ని భయం అంచుల్లోకి తీసుకు వెళ్లింది కరోనా వైరస్. దాదాపు 60 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.. రెండు లక్షల చేరువలో మరణాలు సంబవించాయి.. అయినా ఇంకా కరోరా కరాళ నృత్యం చేస్తూనే ఉంది.  అయితే ఇంత టెక్నాలజీ సాధించిన దేశాలు కరోనా వ్యాక్సిన్ మత్రం కనుగొనలేకపోతున్నాయి. అయితే కరోనాను కట్టడి చేయడానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. ఇమ్యూనిటీ పెంచుకోవాలని.. సామాజిక దూరం పాటించాలి.. నిత్యం మాస్క్ ధరించాల్సిందే అంటున్నారు. కరోనావైరస్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇప్పుడు మాస్క్‌ తప్పనిసరి... మొదట వైరస్ లక్షణాలు ఉన్నవాళ్లు, కరోనా బారినపడినవాళ్లు ధరిస్తే సరిపోతుందని భావించినా... ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వస్తే మాస్క్‌ ధరించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

 

కొందరైతే.. మాస్క్ ధరించినా కొంత దూరం వెళ్లగానే తొలగించేస్తున్నారు.. ఇంకా కొందరైతే ఏ మాస్క్‌ లేకుండానే అలాగే తిరిగేస్తున్నారు.అయితే మాస్క్ లేకుండా బయట ఫైన్ వేస్తున్నారు. సామాన్య జనాలకు మింగలేక కక్కలేని పరిస్థితి ఉంది.  శ్వాసతీసుకోవడంలో వచ్చే ఇబ్బందులే ప్రధాన కారణంగా చెబుతున్నారు.. ఇక, కరోనా సమయంలో రకరకాల మాస్క్‌లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. దీనిలో ఎన్‌95 మాస్క్‌ మెరుగ్గా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. దీంతో, రాష్ట్రాలకు కొంతమేర ఎన్‌95 మాస్క్‌లను అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. అయితే, పంజాబ్‌లోని ఎల్‌పీ వర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త మాస్క్‌ను రూపొందించారు.

 

ఇది ‘నాచు’ మాస్క్‌... పేరు ‘ఆక్సిజనో’... ఈ మాస్క్‌ ఎన్‌95 మాస్క్‌ కంటే మెరుగ్గా పనిచేస్తుందని ఎల్‌పీ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పీల్చుకునే గాలిని 99.3% శుద్ధి చేయడంతోపాటు కరోనా వైరస్‌ సహా కనిష్ఠంగా 0.44 మైక్రోమీటర్ల పరిమాణం ఉండే కాలుష్య కారకాలను సైతం అడ్డుకోగల శక్తి దీని సొంతం అంటున్నారు.  ఈ మాస్క్ నాలుగు లేయర్స్ ఉండటం వల్ల  పైపొరలో ఉండే నాచులోని సూక్ష్మక్రిములు కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించి.. కర్బన ఉద్గారాలను తరిమేస్తాయని... ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి మంచి గాలిని అందిస్తాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: