ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతుంది. ఏడాది పాలనలో రాజకీయ పక్షాలకు నచ్చనిది చేసారు జగన్. అదే ప్రజా పాలన. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ఆయన చేసిన పని. ఏడాదిలోపే మంచి సీఎం అనిపించుకంటానన్న జగన్ ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఎదురుదాడులెన్ని ఎదురైనా ప్రజల కోసమే పని చేశారు. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ చూసిన సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకెళ్లారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రజలకు చేరాల్సింది చేరుతోంది. ప్రజలకు కావల్సింది ఇదే.

 

 

వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి వృద్ధులు ఇళ్లు కదలకుండానే ఇంటికే పెన్షన్లు వెళ్లేలా చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో యజమానులకు 10వేలు అందించారు. మత్స్యకార భరోసా పథకం కింద 10వేలు అందించారు. కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అభివృద్ధి చేశారు. పేద పిల్లల కోసం ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టబోతున్నారు. ఇలా.. ఎన్నో పథకాలు ప్రజల కోసమే ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ జెండా మోసిన వారికి జగన్ ఏ సాయమూ చేయలేదు. వారు ఎదురుచూపులను కూడా జగన్ పట్టించుకోలేదు. ఇది ప్రజల నుంచి జగన్ పై ఏర్పడి సానుకూల దృక్ఫధానికి నిదర్శనం.

 

 

రాష్ట్రం విడిపోయినప్పటి నుంచీ వనరుల లేమి ఒకటే ఏపీకి సమస్య. దీని నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తూనే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసకుంటూ ముందుకెళ్తున్నారు. కాంట్రాక్టల్లో అవినీతి లేకుండా కొత్త టెండర్లను పారదర్శకంగా ఉండేలా ఏర్పాటు చేశారు. రాజకీయ సిఫార్సులను అస్సలు పరిగణలోకి తీసుకోలేదు. ప్రజా ప్రయోజనంతో పాటు, రాష్ట్రాభివృద్ధే పరమావధిగా ముందుకెళ్తున్న జగన్ పాలన ఏడదిగా మెప్పిస్తూనే ఉంది. ప్రజల మనసులను గెలుస్తూనే ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: