2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మోదీ 2019 ఎన్నికల్లో తన ఐదేళ్ల సుపరిపాలనతో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. నేటితో మోదీ పాలనకు ఏడాది పూర్తయింది. మోదీ పాలనకు ఏడాది పూర్తైన సందర్బంగా ఈరోజు మోదీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ సంవత్సర కాలంలో భారతావనిపై చెరగని ముద్ర వేసేలా మోదీ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 
 
రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. నవ భారత నిర్మాణమే లక్ష్యంగా మోదీ పాలన సాగించారు. 2019 సంవత్సరం జులై 30వ తేదీన ట్రిపుల్ తలాఖ్ బిల్లును ఆమోదించటంతో ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందన్న భావన వ్యక్తమైంది. దాదాపు మూడు దశాబ్దాల నుంచి వివాదాస్పదమైన రామ జన్మభూమికి న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కారం లభించింది. 
 
2019 నవంబర్ 29న వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలను రామ జన్మభూమి ట్రస్ట్ కు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు చెప్పినా భద్రత చర్యల విషయంలో, పరిస్థితిని చక్కబెట్టడంలో మోదీ చాకచక్యంగా వ్యవహరించారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా సంవత్సరాల తరబడి రగులుతున్న సమస్యకు బీజేపీ శాశ్వత పరిష్కారం చూపించింది. జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ 370 కింద అనుభవిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిని మోదీ సర్కార్ రద్దు చేసింది. 
 
ఆ ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి రాజ్యసభలో, లోక్ సభలో ఆమోదం పొందేలా చేసి జమ్మూ - కశ్మీర్ భారత యూనియన్ లో సంపూర్ణమయ్యేలా మోదీ సర్కార్ చేసింది. దీంతో భారత చట్టాలన్నీ అక్కడ కూడా అమలవుతున్నాయి. ఇదే సమయంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వివాదాస్పదంగా మారింది. ఈ బిల్లు మతవివక్షకు దారి తీస్తోందని విమర్శలు వినిపించాయి. మోదీ ఏడాది పాలనతో దేశ చరిత్రను మలుపు తిప్పారనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: