" జగన్ అనే నేను "...  అంటూ అశేష అభిమానుల మధ్య జయజయ ధ్వానాల మధ్య ఈ మాట వినిపించే సరిగ్గా సంవత్సరం రోజులు గడిచిపోయింది. ఆ ప్రమాణ స్వీకారం నాడు ప్రారంభమైన సంక్షేమ రథం విరామం లేకుండా ఇప్పటికి పరుగులు తీస్తూనే ఉంది. పేదల కోసం రెండడుగులు ముందే వేస్తున్నాడని అడుగడుగునా ఆయనకు నీరాజనాలు అందుతున్నాయి. పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో వాటిని పూర్తిచేయడం, నది వరద జలాలను ఒడిసిపట్టి ఎందుకు అనేక ప్రాజెక్టుల నిర్మించుకుంటూ వెళుతూ బంజరు భూములను సుభిక్షం చేసి రాష్ట్రానికి అన్నపూర్ణగా ఉన్న పేరుకు దానిని సార్ధకం చేసేలా వైయస్ జగన్ పంచశీల ప్రాజెక్టులను శ్రీకారం చుట్టారు. 


ఇక అలాగే ఈ సంవత్సర కాలంలో వైఎస్ జగన్ తీసుకున్న అనేక పారదర్శక విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. దీనితో రాష్ట్రంలో 2503 కోట్ల పెట్టుబడితో దగ్గరదగ్గరగా 65 వేల మందికి ఉద్యోగాలు చేకూరాయి. ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ పై వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

 

మనం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే భారీగా రోజురోజుకీ పరీక్షలు పెంచుకుంటూ వెళ్తున్నారు. కరోనా నియంత్రణ కోసం జగన్ సర్కారు అనేక చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ లాక్ డౌన్ కఠినంగా నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ విషయంలో జగన్ సర్కారు పనితీరు పై జగన్ కు ఏకంగా 70 శాతం మంది ప్రజలు సమర్థిస్తున్నారు. మొదట్లో జగన్ ఈ విషయంపై అసలు పట్టించుకోవడం లేదన్న వారే ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి ని ఫాలో అవుతున్నారు అంటే అది నిజంగా జగన్ గొప్పదనమే. మొదట్లో ఆయన ఏమి చెప్పినా విడ్డూరంగా చూసే ప్రజలు చివరికి జగన్మోహన్ రెడ్డి ఇ చెప్పినవే సత్యాలుగా జరుగుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: