దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నా, కొత్తగా కేసులు నమోదు అవుతుండడం, అలాగే లాక్ డౌన్ కారణంగా ప్రజలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం, అన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులతో ఉండటం వంటి కారణాలతో లాక్ డౌన్ కు కొన్ని కొన్ని మినహాయింపులను కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది. రేపటితో నాలుగో విడత లాక్ డౌన్ కూడా ముగియనున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంతనాలు చేశారు. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,763 కి చేరుకుంది. 

 

IHG


24 గంటల్లో దేశంలో 265 మంది మరణించగా, మొత్తం ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4971 కి చేరింది. ఈ తరుణంలో కేంద్రం లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అని దేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కేంద్రం లాక్‌డౌన్‌ ను జూన్ 15వ తేదీ వరకు పొడిగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పొడిగింపు సందర్భంగా ఎటువంటి మినహాయింపులు ఇవ్వాలి ? ఏ ఏ ప్రాంతాల్లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలి అనే విషయాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయాలని కేంద్రం ఆలోచిస్తోందట. అలాగే విద్యా సంస్థలు, మెట్రో సేవలు ప్రారంభం పై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునేలా కేంద్రం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 

 

IHG


అంతే కాకుండా ఆధ్యాత్మిక ప్రాంతాలైన ఆలయాలు, మసీదులు, చర్చిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించబోతోందట. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సేవలు, రాజకీయ సమావేశాలు, మాల్స్ ,థియేటర్ పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. అలాగే 80% కరోనా కేసులు నమోదైన 30 మున్సిపాలిటీలో మాత్రం కఠినంగా ఆంక్షలు విధించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది . తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బెంగాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, పంజాబ్, ఒడిశాలో ఉన్న ముప్పై మున్సిపాలిటీల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని విషయాలపైన మన్ కీ బాత్ కార్యక్రమం లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో మోదీ ప్రకటనపై అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: