2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అధికారం చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనను గాడిలో పడింది అని చెప్పాలి. ఎలాంటి అనుభవం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి... ఎలా పాలన సాగిస్తారో  అందరూ అంటుంటే.. అంచనాలను తారుమారు చేసే విధంగా... అసాధారణ రీతిలో పాలన సాగించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. యువ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో ఎంత పరుగులు పెడుతుంది నిరూపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 


 అయితే సరిగ్గా ఇదే రోజున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక జగన్ మోహన్ రెడ్డి సంవత్సర పాలన ఒక చారిత్రాత్మక అధ్యాయం అని చెప్పవచ్చు. ఎన్నో సంచలన నిర్ణయాలు మరెన్నో సంక్షేమ పథకాలు... ఇలా ప్రజా సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తమది పేదల ప్రభుత్వం అని పేదల అభ్యున్నతే తమ ముఖ్య లక్ష్యం అన్నట్లుగా ముందుకు సాగారు. ప్రతి పేదవాడికి చేయూతనిచ్చే విధంగా... పథకాలను ప్రవేశపెట్టడం కీలక నిర్ణయాలు తీసుకోవడం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 


 ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రస్తుతం ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది జగన్ సర్కార్. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉండగా వైద్య కళాశాలలకు అనుబంధంగా 6,  గిరిజన ప్రాంతాల్లో 7,  సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రానున్నట్లు తెలిపింది జగన్ సర్కార్. దీని కోసం ఏకంగా ఆరు వేల ఒక వంద కోట్లు ఖర్చు చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: