కొందరు చెప్పకుండా చేస్తారు.. మరికొందరు చెప్పి చేసి చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రెండో కోవకు చెందుతారు. నిజానికి ఇది చాలా కష్టమైన ప్రక్రియ. చెప్పకుండా సాధిస్తే శెభాష్ అంటారు.. చెప్పి కూడా సాధించలేకపోతే వేయి నోళ్లు గొంతెత్తి అవహేళన చేస్తాయి. కానీ.. జగన్ ఆ రెండో అవకాశాన్ని ఎవరికీ ఇవ్వలేదు. అనుకున్నదే కాదు.. కావాలనుకున్నది చెప్పి సాధించారు. ప్రజల్లో తిరుగులేని విజయభావుటా ఎగుర వేసి రాష్ట్రాధినేత అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి నేటికి సరిగ్గా ఏడాది పూర్తైంది.

 

 

పదేళ్ల పోరాటం ఫలితం ఎంత మధురంగా ఉంటుందో చెప్పే విజయాన్ని సాధించారు జగన్. ప్రతిపక్షాల కుట్రలు, జాతీయ పార్టీ సైతం చేసిన కుట్రలను ఎదుర్కొని ధీటుగా పోరాడారు. జగన్ లో ఉన్న పోరాటతత్వానికి ఇవన్నీ పరీక్ష పెట్టాయి. కానీ.. యోధుడిగా పోరాడి ధీరుడిగా ప్రజల మధ్యలో విజయదుందుభి మోగించారు. అధికారపక్షం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సమయంలో జగన్ ఓర్పుతోనే ఎదుర్కొన్నారు. అధికార పార్టీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి.. ప్రజా తీర్పును ముందే పసిగట్టి రాబోయే రెండేళ్లలో ఏం జరుగుతుందో ముందే చెప్పారు. ప్రజల్లో ఎలా ఉండాలో.. ప్రజలకేం చేయాలో సుదీర్ఘ పాదయాత్రలో బాగా అవగతం చేసుకున్నారు.

 

 

నంద్యాల ఉప ఎన్నికలు జరిగిన తీరు.. వచ్చిన ఫలితం గురించి తెలిసిందే. ఫలితం అనంతరం కూడా జగన్ ఎంతో ధైర్యంతో, మరెంతో నమ్మకంగా చెప్పిన మాటలు నిజమయ్యాయి. ‘ప్రత్యర్ధి ఎంత గట్టిగా కొడితే మనమెంత ధైర్యంగా ఎదుర్కొన్నాం అన్నదే ముఖ్యం. ఇప్పుడు మమ్మల్ని కొట్టారు.. తీసుకున్నాం.. మాకూ టైమ్ వస్తుంది.. మేమూ కొడతాం.. మేమేంటో చూపిస్తాం’ అనే ఎవరూ అంత ధైర్యంగా చెప్పలేరు. కానీ.. జగన్ చెప్పి.. చేసి చూపించారు. అనుకున్నది సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: