ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న మిడతల దండు ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా దగ్గరగా వచ్చేసింది. మహారాష్ట్ర సరిహద్దులోని జిల్లాలకు కేవలం150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వార్దా వరకూ చేరింది. 3 కిలోమీటర్ల  మేర ఉన్న కోట్లాది మిడతల గుంపు ఎప్పుడు రాష్ట్రానికి చేరుతుందోనని సరిహద్దు జిల్లాల్లోని రైతుల్లో బుగులు మొదలైంది. దేశంలో మిడతల గుంపులు ఇంత లోపలి వరకు రావడం1993 తరువాత ఇదే మొదటిసారి. గతంలో గుజరాత్‌, రాజస్తాన్‌తో పాటు హర్యానా, పంజాబ్‌కే పరిమితమయ్యేవి. జోధ్ పూర్ నుంచి మే15న ప్రారంభమైన మిడతలు.. రెండు మూడ్రోజుల్లోనే వెయ్యి కిలోమీటర్ల దూరం వచ్చాయి. మొదట మధ్యప్రదేశ్‌ వరకు వచ్చిన భారీ దండు అక్కడి నుంచి రెండు గుంపులుగా విడిపోయింది. ఒకటి ఢిల్లీ, హర్యానా, యూపీ దారి పట్టగా, మరొకటి మధ్యప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రలోని అమరావతి, మోర్షీ తాలుకాకు వచ్చాయి.  

 

మిడతలతో మనుషులకు ప్రమాదం ఉండదు. ఇండ్ల వద్దకు వస్తే ఇరిటేటింగ్‌ గా ఉంటుంది. వీటివల్ల రోగాలు వచ్చే అవకాశం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిని చంపేందుకు పంటలపై మందులను స్ప్రే చేస్తే.. కొంత వ్యవధి తర్వాత కోస్తే ప్రమాదం ఉండదు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ, మధ్య భారతాన్ని వణికిస్తున్న మిడతల దండు సమస్యకు రాజస్తాన్ వ్యాపారులు అద్భుత పరిష్కారం కనిపెట్టారు.   మిడతలతో వేపుళ్లు, బిర్యానీ వండి అమ్ముతున్నారు.  

 

మకాడ్ బిర్యానీ’ అంటూ పురుగులు బిర్యానీని కాస్త ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ధార్, జైపూర్ రెస్టారెంట్లలో ప్లేటు మిడతల బిర్యానీ రూ. 200 పలుకుతోంది.  ఆ మద్య ఆస్ట్రేలియా పరిశోధకులు వింత పరిష్కారం చెప్పారు. మిడతల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయట. అవి లక్షలాదిగా లభ్యమవుతున్నందున వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని సూచించారు. చాలా దేశాలు మిడతలను ఆహారంగా తీసుకొని వాటి బెడద తగ్గించుకున్నాయని చెబుతున్నారు. రొయ్యలకు బొప్పి తీసి వండినట్టు మిడతలకు కూడా కాళ్లు, రెక్కులు పీకేసి, మధ్యభాగాన్ని మాత్రమే వండుతున్నారు.  అయితే ఇది కేవలం వ్యాపారుల స్టంట్ మాత్రమేనని, పురుగుల వంటకాలను ఎవరూ తినడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: