దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సరిగ్గా నేటికి సంవత్సర కాలం పూర్తయిన విషయం తెలిసిందే. 2014లో మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ... భారత పాలనను ఎంతో ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ఇక భారత అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసాయి. ఒక ప్రధాన మంత్రి భారత అభివృద్ధి కోసం ఇంత చేయగలుగుతాడ అని ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసేలా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ప్రభావితం చేశారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ ప్రజలను ఇంతగా ప్రభావితం చేయడంతో... రెండవసారి కూడా దేశ ప్రజానీకం మొత్తం నరేంద్ర మోడీ పాలన వైపే మొగ్గు చూపారు. 

 


 దీంతో 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా బిజెపి పార్టీ మరోసారి ఘన విజయాన్ని సాధించింది. ఈసారి ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు . 2019  మే 30వ తేదీన సరిగ్గా ఇదే రోజున రెండవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు నరేంద్ర మోడీ. అయితే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండవసారి ప్రమాణస్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం ప్రధాని మోదీ పాలనపై  సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎంతో మంది ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 

 అయితే ఈ సందర్భంగా ఏడాది పాలన పూర్తైన సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేసిన లేక పై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లేఖపై కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య అనే ఓ వ్యక్తి సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్రమోదీ రాసిన లేఖ వలస కార్మికుల రక్తంతో రాసినది అంటూ కార్టూన్ వేశారు సదరు కార్టూనిస్ట్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే వలస కార్మికులు లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు చేరుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. స్వస్థలాలకు చేరుకునేందుకు వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులకు  సంబంధించిన దృశ్యాలు ఎంతోమంది మనసును కలచివేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: