చెడపకురా చెడేవు అంటారు పెద్దలు.. ఏదో చేయబోతే అదేదో అయినట్టుంది. అసలే కరోనాకి వ్యాక్సిన్ లేదు జాగ్రత్తలు తీసుకుంటేనే మనిషి ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదని కరోనా మొదలైనప్పటి నుంచి నెత్తీ నోరు బాతుకుంటున్నారు.  కానీ కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఈ కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకుతూ వస్తుంది. వైరస్‌ను అంత సులువుగా తీసుకోవద్దని చెబుతున్నా చాలా మంది వినిపించుకోవడం లేదు. పైగా వ్యాధికి గురై అవస్థ పడుతున్నారు.  తాజాగా  కరోనాతో చనిపోయిన ఓ మహిళ మృతదేహాం బ్యాగ్ లో భద్ర పరిచి అంత్యక్రియలు చేయడానికి తీసుకు వచ్చారు.. ఇక్కడే పెద్ద పొరపాటు చేసి 18 మంది కరోనా అంటించుకున్నారు. థానే జిల్లాలోని ఉల్లాస్‌ నగర్‌లో మే 25న 40 ఏళ్ల మహిళ కరోనాతో మరణించింది. ఆమె మృతదేహాన్ని వైద్యులు ప్రత్యేక బ్యాగులో భద్రపరిచి అంత్యక్రియలు చేసుకునేందుకు బంధువులకు ఇచ్చారు.

 

ఆ బ్యాగ్ ఎలాంటి పరిస్థితుల్లోనూ తెరవడానికి వీలు లేదని డాక్టర్లు హెచ్చరించారు.  భారతీయుల సెంటిమెంట్ తెలిసిందే.. కడ చూపు చూసుకంటాం అంటూ  అక్కడికి వచ్చిన బంధువులు ఇవేమి పట్టించుకోలేదు. చాలా నిర్లక్ష్యంగా ఉంటూ బ్యాగును తెరిచి మృతదేహాన్ని తాకారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అధికారులు అంత్యక్రియలకు హాజరైన 50 మంది వెంటనే క్వారంటైన్ చేసి పరీక్షించగా.. 18 మందికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మిగితా వారిని కూడా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.

 

కరోనా అనేది క్షణాల్లో విస్తరిస్తున్న వైరస్.. ప్రతిరోజూ టివి, సోషల్ మీడియాలో ప్రతిరోజూ కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూనే ఉన్నారు.  కానీ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి ప్రమాదాలు ఏరి కోరి తెచ్చుకుంటున్నారు. అక్కడ హాజరైన మిగితా వారిని కూడా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ముందు జాగ్రత్త హెచ్చరికలు చేసినా మృతురాలి బంధువులు వినిపించుకోకుండా వైరస్ అంటించుకోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిర్లక్ష్యంగా ఉంటై తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: