సాధారణంగా చిన్ని పిల్లలు బూచాడు వచ్చాడంటే భయపడిపోతారు.  మారాం చేస్తే వాళ్లకు ఎవరంటే భయమో వారిని పిలుస్తామని చెబితే చాలు గమ్మునుంటారు. పదేళ్లు వచ్చేవరకు తల్లిదండ్రులు ఏదైనా విషయం చెప్పి భయపడితే పిల్లలు భయపడిపోతారు.  కొంత మంది మరీ గారాభం చేయడం వల్ల పిల్లలు మారాం చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా వస్తుంటాయి.  అయితే ఆ పిల్లలు భయపడే మనస్థత్వం కాదని.. వారికి ధైర్యం ఎక్కువ అని చిన్నారుల తల్లిదండ్రులు అంటుంటారు.   వారి తాహతకు మించిన పనులు చేయడం వల్ల ఇబ్బందుల్లో పడుతుంటారు.  ఇక పిల్లలు తమకు జ్ఞానం వచ్చే వరకు తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకోవాలని అంటారు. కానీ కొంత మంది తల్లిదండ్రులు నిర్లక్ష్య వైఖరి వల్ల పిల్లల ప్రాణాల మీదకు వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  పిల్లలను తల్లిదండ్రులు నిత్యం ఒక కంట కనిపెడుతూ ఉండాలి.

 

ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా విషాదాలే మిగులుతాయి. పిల్లలు తప్పిపోకుండా వారికి చేతికి తగలించే తాడు ఓ బాలికకు నరకం చూపించింది. కానీ ఆ సమయంలో ఆ పాప చూపించిన ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు.  మనల్ని ఎవరైనా తోసి వేస్తే ఉలిక్కి పడి భయపడతారు.. కొన్ని సార్లు గుండె ఆగినంత పని అవుతుంది. కానీ ఆ పాప మాత్రం తనను ఉన్నట్టుండి తాడు పైకి సర్రున గుంజింది. ఆ పిల్లలకు గుండె ధైర్యం ఉండబట్టి కంగారుపడకుండా ప్రాణాలతో బయటపడింది. చైనాలోని హుబీ రాష్ట్రం డాయి నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ బాలికకు ఆమె తల్లి సేఫ్టీ లీష్ తగలించింది.

 

ఒక కొసను కూతురి చేయికి తగలించి, మరో కొసను తను పట్టుకుంది. అయితే ఏం జరిగిందోగాని ఆ పిల్ల ఒక్కతే లిఫ్టులోకి వచ్చింది. దీంతో మరో కొస రింగ్ బయటే ఉండిపోయింది. ఈ లోపల లిఫ్ట్ కిందికి వెళ్లింది. దాంతో ఆ పాప ఒక్కసారే  పైకి ఎగిరి ఆ తాడుతోపాటు లిఫ్ట్ తలుపు అంచుకు వేలాడింది. తర్వాత లిఫ్ట్ ఆగిపోవడంతో పాప ఒక్కసారే కిందపడిపోయింది..వెంటనే తేరుకొని ధైర్యంగా బోర్డు వద్దకు వెళ్లి బటన్లు నొక్కి బయటపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: