ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా జనాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో టిక్ టాక్ వచ్చినప్పటినుంచి... నెటిజన్లు గంటల తరబడి ఈ సరికొత్త ఎంటర్టైన్మెంట్ పొందేందుకు ఇష్టపడుతున్నాను. ఇక ఈ టిక్ టాక్ యాప్ తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించింది. ఇక ఈ టిక్  టాక్  వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. చిన్నల  నుంచి పెద్దల వరకు అందరూ ఉపయోగిస్తున్నారు. టిక్ టాక్ లో ఇప్పటివరకు ఏ యాప్ లో  దొరకనంత సరికొత్త ఎంటర్టైన్మెంట్ దొరుకుతుండటంతో  ఎక్కువగా జనాలు ఈ టిక్ టాక్ వాడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. టిక్ టాక్ ద్వారా తమ టాలెంట్ను నిరూపించుకో ని మంచి అవకాశాన్ని దక్కించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. 


 ఇక ఈ టిక్ టాక్ ద్వారా మంచి జరగడం కంటే చెడు జరగడం ఎక్కువగా అయిపోయింది. ఈ మాయదారి టిక్ టాక్ ఎంతో మంది భార్యా భర్తల మధ్య చిచ్చు పెట్టింది. ఇంకెంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. టిక్ టాక్లో ఎక్కువ లైకులు సంపాదించాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన స్టెంట్స్  చేసి ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఇక్కడ ఇలాంటిదే జరిగింది.. టిక్ టాక్ మోజులో  ఏకంగా ఐదుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. కాస్త డిఫరెంట్ గా టిక్ టాక్ చేసి లైకులు సంపాదించుకోవాలి అనుకుంటున్నారు. ఏకంగా టిక్టాక్ వీడియో చేయడం కోసం గంగానదిలో దిగారు ఐదుగురు బాలురు. ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన వారణాసిలో చోటుచేసుకుంది. 

 

 ముందుగా ఒక బాలుడు  గంగా నదిలోకి దిగాడు  ఒడ్డున నిలబడి కొందరు  వీడియో తీశారు. అయితే లోతును సదరు బాలురు అంచనా వేయలేకపోవడంతో  ఒక్కసారిగా నీటిలో  మునిగిపోయారు బాలురు . దీంతో అతడిని కాపాడే క్రమంలో మిగతా నలుగురు కూడా ప్రయత్నాలు చేస్తూ నదిలో మునిగి పోయి మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం ఆ ఐదుగురు బాలుర  మృతదేహాలను రామ్ నగర్ లోని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇక ఈ ఐదుగురుకి  14 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉంటారని పోలీసులు నిర్ధారించారు.కాగా  ఒకేసారి ఐదుగురు బాలురు మృతి చెందడంతో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: