ప్రపంచంలో ఇప్పుడు కరోనా విళయతాండవం చేస్తుంది. ఎక్కడ చూసినా ఈ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి.  అయితే కరోనా సమయంలో రాక్షసంగా మనుషుల ప్రాణాలు హరిస్తున్న కరోనా కన్నా రాక్షసంగా తయారవుతున్నారు మనుషులు.  ఐనవారికి కరోనా వస్తే కనికరం చూపని పరిస్థితి నెలకొంది.  ఈ మద్య తల్లికి కరోనా వచ్చిందన్న నెపంతో ఇద్దరు తనయులు ఆమెను ఊరి బయట ఉంచిన సంఘటన చోటు చేసుకుంది.  కరోనా వచ్చిందని భయంతో బంధువులు ఎవరూ రాక ఓ రిక్షాలో తన తల్లిని తీసుకు వెళ్లి ఒంటరిగా అంత్యక్రియలు చేశాడో తనయుడు.  కరోనా వచ్చిందని తెలిస్తే చాలు ఓ బూచాడిగా చూస్తున్నారు.  కరోనాతో చనిపోయినవారిని శ్మశానంలో పూడ్చటానికి కూడా కొందరు అమానవీయులు అడ్డుకుంటున్న దారుణ ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.

 

 

పూర్తిగా మానవత్వం మరచిన మనుషుల్లా తయారు అవుతున్నారు. ఎవరి ప్రాణం వారికి తిపి.. అలాంటిది డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు.. ఇతర అధికారులు ఎలాంటి భయం లేకుండా ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారు. తాజాగా  నాలుగు నెలల శిశువు కరోనాతో చనిపోయాడని భావించిన చవాండీ గ్రామస్థులు అంత్యక్రియలకు నిరాకరించారు. ఈ  విషయం తెలుసుకున్న భిల్వారా జిల్లాలోని ఓ సబ్ డివిజినల్ ఆఫీసర్(SDO) వారి పాపాన వారిని వదిలేసి.. ఆ చిన్నారి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

 

చిన్నారి చావుకు కరోనానే కారణమని గ్రామస్థులు అనుమానించారు. ఆ బిడ్డ అంత్యక్రియలు నిర్వహించడకుండా అలాగే వదిలేశారు. గురువారం మధ్యాహ్నాం వరకు బిడ్డ శవం వద్దకు ఎవరూ వెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న కరేడా SDO మనిపాల్ సింగ్ స్వయంగా బొంత తవ్వి పూడ్చి పెట్టాడు. అయితే  ఆ చిన్నారికి కరోనా లేదని, నెగిటివ్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నమ్మలేదు.  ఇలా ఎంతో మంది గ్రామాల్లో కరోనా వచ్చిందంటే భయపడిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: