జగన్ ఏడాది పాలనపైన ఇపుడు విస్త్రుతంగా చర్చ సాగుతోంది. జగన్ ఏం చేశారు, ఏం చేయలేదు అన్న దాని మీద విశ్లేషణలు వస్తున్నాయి. ఎవరిని వారు జగన్ ప్లస్సులు, మైనస్సులు విప్పిచెబుతున్నారు. కానీ అన్నింట్లో కామన్ పాయింట్ ఒకటి ఉంది.

 

అదేమంటే జగన్ పాలనలో సంక్షేమం పరుగులు పెట్టిందని, అనేక పధకాలు జగన్ అమలు చేస్తూ దేశంలో నే ఎక్కడా లేని విధంగా ముందుకు దూసుకుపోతున్నారన్నది మాత్రం అన్ని నోట్లలోనూ  వచ్చింది. దీని మీద టీడీపీకి చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తీసుకుంటే ఆయన జగన్ సంక్షేమ జపం జపిస్తున్నారని అంటున్నారు. దాని వల్ల ఓట్లు రావు అని అంటున్నారు. కానీ వైఎస్సార్ అదే సంక్షేమ జపంతో 2009 ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన దాన్ని ఆయన మరచిపోతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

 


సరే ఓట్ల సంగతి పక్కన పెడితే జగన్ మాత్రం పధకాలు  అమలు చేస్తున్నారన్నది మాత్రం టీడీపీ కూడా ఒప్పుకున్నట్లైంది. ఇక రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా జగన్ అభివ్రుధ్ధి కంటే సంక్షేమం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని, ఆ విధంగా చూసుకున్నా వెల్ఫేర్ స్టేట్ గా జగన్ ఏపీలో నిలిపారని అర్ధమవుతోంది.

 

ఇక రాజకీయంగా చూసుకుంటే జగన్ దూకుడు మీదనే ఉన్నారు. ఆయన ప్రత్యర్ధి పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. వారి ఆదాయపు పట్లు, ఆయువు పట్లు మీదనే గట్టి దెబ్బ కొడుతున్నారు. జగన్ ఓ వైపు ప్రజకలు సంక్షేమం అందిస్తూ చేపడుతున్న సంస్క‌రణలు, వికేంద్రీకరణ విధానాలు అన్నీ చూసుకున్నపుడు విపక్షం పూర్తిగా డిఫెన్స్ లో పడిపోతోంది.

 

మొత్తానికి రాజకీయంగా పదకొండేళ్ల అనుభవంతోనే జగన్ మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. 2024 నాటికి ఆయన పదిహేనేళ్ల రాజకీయ అనుభవంతో పాటు సీఎం గా అయిదేళ్ల అనుభవంతో రాటు దేలి ఎన్నికలకు వెళ్తే మాత్రం ప్రతిపక్షం ఎదుర్కోవడం కష్టమేనన్న మాట గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి జగన్ తన రూటే సేపరేట్ అని తొలి ఏడాదిలోనే ప్రూవ్ చేసుకున్నారు.'

మరింత సమాచారం తెలుసుకోండి: