అదిరిపోయే మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చి కరెక్ట్‌గా సంవత్సరం అయిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా 151 సీట్లు సాధించి 2019 మే 30న జగన్ తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జగన్ అలా ప్రమాణ స్వీకారం చేశారో, లేదో..అప్పుడే అధికారం కోల్పోయిన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం గలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు జగన్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. జగన్‌కు సీఎం పీఠంలో సర్దుకోవడానికి కనీస అవకాశం ఇవ్వకుండా రాజకీయం చేయడం స్టార్ట్ చేశారు.

 

జగన్ తీసుకునే ప్రతి  నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రతి పథకాన్ని విమర్శించారు. చాలా అంశాల్లో హైకోర్టుకు వెళ్ళి జగన్‌ స్పీడుకు బ్రేకులు వేసేందుకు ప్రయత్నించారు. అయితే జగన్ తీసుకున్న పలు నిర్ణయాలకు వ్యతిరేకంగానే హైకోర్టు నుంచి తీర్పులు వచ్చాయి. దాదాపు 65 అంశాల్లో జగన్‌కు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయని, టీడీపీ అనుకూల మీడియా వార్తలు కూడా వేస్తోంది.

 

తాజాగా కూడా ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్‌కు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. దీంతో టీడీపీ శ్రేణులు తెగ హడావిడి చేసేస్తున్నాయి. జగన్‌కు పెద్ద మొట్టికాయే పడిందంటూ కామెంట్లు చేస్తున్నారు. సరే హైకోర్టు నుంచి వచ్చిన తీర్పులని ప్రభుత్వం అంగీకరిస్తూనే, జగన్ ప్రమాణం చేసి ఏడాది పూర్తి అయిన సందర్భాన్ని కూడా వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి.

 

ఈ క్రమంలోనే  వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పులు అటుంచితే ప్రజా క్షేత్రంలో మాత్రం ప్రజల తీర్పు జగన్ వైపే ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే జగన్ విషయంలో ఈ ఒక్క మాట నిజమే అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రజల్లో జగన్‌పై ఎలాంటి వ్యతిరేకిత లేదని, సంక్షేమ పథకాలే జగన్‌కు శ్రీరామరక్షగా ఉంటాయని అంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకిత ఉందనేది కేవలం బాబు సృష్టే అని, జనాలు ఎప్పుడు జగన్ వెంటే ఉంటారని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: