నారా లోకేష్‌కు రాజకీయాలే పెద్దగా తెలియవని, ఆయనకు సరిగా మాట్లాడటమే రాదని, రాజకీయాల్లో పెద్ద పప్పు అని వైసీపే శ్రేణులు ఎప్పుడు ఎగతాళి చేస్తూనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే తొలిసారి ఎన్నికల బరిలో దిగి మంగళగిరి స్థానం ఓటమి పాలవ్వడం, అదే సమయంలో టీడీపీ కూడా దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చాక, చినబాబు కాస్త యాక్టివ్ గానే మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నట్లుంది.

 

కాకపోతే బయట కంటే సోషల్ మీడియాలోనే జగన్ ప్రభుత్వంపై స్పష్టంగా విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వరుస పెట్టి విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతూ...జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇక అందులో ఒక పోస్టు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని జగన్ నాశనం చేస్తున్నట్లు పెట్టారు. ఏడాది పాలనలో 87 వేల కోట్ల అప్పు, పైగా రాష్ట్ర ఆస్తుల అమ్మకం.. ఒక్క ఛాన్స్ అడిగి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని నాశనం చేసి గన్నేరుపప్పు అనే పేరుని జగన్ సార్ధకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

 

అయితే చినబాబు జగన్‌ని ఉద్దేశించి గన్నేరు పప్పు అంటే, వైసీపీ శ్రేణులు ఊరుకుంటాయా...వెంటనే పప్పు అంటూ చినబాబుని వేసుకున్నారు. అసలు చినబాబుకు వివరం తెలియదనుకుంటా అని ఫైర్ అయిపోతున్నారు. 87 వేల కోట్లు అప్పులు అయ్యాయని లోకేష్‌కు తెలుసా? ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన వచ్చి ఆయన చెవిలో చెప్పారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

ఇక రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఎవరి హయాంలో నాశనమైపోయిందో తెలుసని, ఇష్టారాజ్యంగా వేస్ట్ ఖర్చులు చేసి, రాష్ట్రాన్ని అప్పులు పలు చేసింది చంద్రబాబు అని ప్రజలందరికీ తెలుసని కౌంటర్లు ఇస్తున్నారు. 2లక్షల కోట్లకు పైనే అప్పులు చేయడం, లక్ష కోట్ల వరకు పెండింగ్ బిల్లులని వదిలేసి జగన్ ప్రభుత్వంపై పెట్టారని , వాటిని జగన్ ప్రభుత్వమే కట్టిందని చెబుతున్నారు. ఇప్పటికైనా చినబాబు వివరం తెలుసుకుని మాట్లాడితే మంచిందని హితవు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: