ఐదో విడ‌త లాక్ డౌన్‌పై నెల‌కొన్న ఉత్కంఠ వీడింది. లాక్ డౌన్ 5 ను కేంద్రం జూన్ 30 వరకు పొడగించింది. ఇప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలలో కొన్నిటికి మాత్రమే సడలింపులు ఇచ్చింది. అయితే, కేంద్ర లాక్ డౌన్ ప్రకటించే ముందే కొన్ని రాష్ట్రాలు స్వచ్చందంగానే లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించుకున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరోసారి జూన్ 15 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు ఆ రాష్ట్రం తీసుకునే నిర్ణ‌యంపై అంద‌రి దృష్టి ప‌డింది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖ‌రి చ‌ర్చ‌కు దారితీస్తోంది.

 


కేంద్ర ప్రభుత్వం మార్చ్ 24 నుండి ఏప్రిల్ 14 వరకు మొదటి విడత లాక్ డౌన్ డౌన్ ప్రకటించింది. అంత‌కుముందే తెలంగాణ ప్ర‌భుత్వం లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. మొద‌టి విడ‌త లాక్ డౌన్ త‌ర్వాత  ఏప్రిల్ 15 నుండి మే 3 వరకు రెండొవ విడత లాక్ డౌన్ ప్రకటించింది. ఈ గ‌డువు కంటే ఎక్కువే తెలంగాణ స‌ర్కారు డేట్ విధించింది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మరోసారి అంటే మే 3 నుండి మే 17 వరకు మూడవ విడత లాక్ డౌన్ అమలయ్యింది. ఈ గ‌డువు విష‌యంలోనూ తెలంగాణ స‌ర్కారు గ‌డువు పెంచింది. తరువాత మరోసారి మే 17 నుండి మే 31 వరకు మరోసారి నాల్గోవ విడత లాక్ డౌన్ ప్రకటించింది. ఈ స‌మ‌యంలో కేంద్రం నిర్ణ‌యం ప్ర‌కార‌మే తెలంగాణ సీఎం వ్య‌వ‌హ‌రించారు.

 

ఇప్పుడు ఐదో విడ‌త లాక్ డౌన్ విష‌యంలో కేంద్రంతో పాటే తెలంగాణ సీఎం తేదీల‌ను నిర్ణ‌యిస్తారా లేక ప్ర‌త్యేకంగా మ‌రేదైనా తేదీల‌ను ఖ‌రారు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలాఉండ‌గా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ మరికొద్ది రోజులు లాక్ డౌన్ ను పొడిగించాలనే యోచనలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: