ఓ వైపు కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ 5.0 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసి షాక్ ఇవ్వ‌గా మ‌రోవైపు బీజేపీ పాలిత రాష్ట్రమై క‌ర్ణాట‌క స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర రాజ‌ధాని బెంగ‌ళూరులో కరోనా కట్టడిలో భాగంగా కర్ణాటక రాష్ట్రం గత ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధించింది. గత ఆదివారం పూర్తిగా రోజంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు అన్ని  ప్రభుత్వం మూసేసింది. అయితే ప్రజలు ఈ ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను ఎత్తేయాలని సామాజిక మాద్యమాలు, ఇతర మార్గాలలో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో ఎక్కవ మంది ప్రజలు ఈ విదానాన్ని వద్దని అభ్యర్థించడం వల్ల ఈ ఆదివారం నుంచి ప్రతి రోజు లాగానే లాక్‌డౌన్‌ నిభందనలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎం విజయ్‌ భాస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

అయితే ఈ ఆదివారం ఇతర రోజుల్లో ప్రజలు ఏ విధంగా అయితే లాక్‌డౌన్‌ను పాటించారో అదే విధంగా పాటించవచ్చు. దీంతో ఆదివారం కర్ణాటకలో ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దాదాపు 3500 బస్సులను ఆదివారం నడపనుంది. అయితే శుక్రవారం ఒక్కరోజే కర్ణాటకలో 248 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇదే ఒక్కరోజు అత్యధిక కేసుల రికార్డు కావ‌డం గ‌మ‌నార్హం.

 

ఇదిలాఉండ‌గా, ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్ డౌన్ 5.0 కు సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని.. నైట్ కర్ఫ్యూ మాత్రమే కొనసాగుతుందని తెలిపింది. దీనిద్వారా రాత్రిపూట వ్యక్తుల కదలికను గమనిస్తుందని పేర్కొంది. రాత్రి 9 గంటలనుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ కొనసాగనుంది.. ఇక అలాగే రాజకీయ, సామాజిక, మతపరమైన కార్యకలాపాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: