పాకిస్తాన్ మీడియా ఎప్పుడు భారత దేశం పై విషం కక్కేందుకు  సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సమయం సందర్భం లేకుండా భారత్పై ఎప్పుడూ విషం వెళ్లగక్కుతూ  ఉంటుంది. ముఖ్యంగా మోడీ పైన అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటుంది పాకిస్థాన్. 2014లో నరేంద్రమోడీ అధికారం చేపట్టే  ముందు నుంచి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక అటు భారత మీడియా కూడా మైనార్టీలకు మోదీ వ్యతిరేకం అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి  వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయింది. 

 


 నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అప్పటి నుంచి భారత పాలన గాడిలో పడిన విషయం తెలిసిందే. రెండవసారి మోదీ అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి అయిపోయింది అంతకు ముందు ఐదు సంవత్సరాలు అంటే మోదీ  మొత్తం  భారతదేశంలో పాలన సాగించింది ఆరు సంవత్సరాలు. ఈ ఆరు సంవత్సరాలలో నరేంద్ర మోడీ ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచారు. తనదైన సంస్కరణలతో ప్రణాళికలతో వ్యూహాలతో ముందుకు సాగారు. దేశం అభివృద్ధి విషయంలో, ప్రజా సంక్షేమం విషయంలో, సరిహద్దుల్లో సైన్యం విషయంలో ఇలా ప్రతి విషయంలో ప్రణాళికలతో  ముందుకు సాగారు. 

 


 అయితే ప్రస్తుతం ఎప్పుడూ భారత్పై విషం కక్కుతూ ఉండే పాకిస్తాన్ ఇప్పుడు నరేంద్ర మోడీ పనితనానికి ఫిదా అయినట్లు తెలుస్తోంది. క్రమక్రమంగా నరేంద్ర మోడీ పై విమర్శలు చేయడం మాని అలాంటి ఒక నాయకుడు పాకిస్తాన్ లో ఉంటే ప్రపంచం మొత్తం పాకిస్తాన్ కి తలవంచుతుంది అంటూ ప్రస్తుతం అక్కడి మీడియా డిబేట్ లలో కూడా పలువురు విశ్లేషకులు మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రతి విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతూ విజయం సాధిస్తున్నారు అని అనుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ మొత్తం కాదు కానీ ఏదో అక్కడక్కడా కొంతమంది మాత్రం ఇలా మోడీ గురించి ఆలోచించే పనిలో పడ్డారు అంటే మార్పు మొదలైంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: