అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ గత కొంత కాలం నుంచి పక్క దేశాలు విషయంలో కూడా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్న విషయం తెలిసిందే. గతంలో కాశ్మీర్ వివాదం లో కూడా జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం వహిస్తాను  అంటూ చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ . కానీ మీ మధ్యవర్తిత్వం వద్దు అని  సున్నితంగా తిరస్కరించింది భారత్. అదే సమయంలో పాకిస్థాన్ మాత్రం ట్రంప్  మధ్యవర్తిత్వం కావాలంటూ తెలిపింది. మామూలుగా అయితే డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ మీడియా ముందే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఏదో ఒక విషయంలో వ్యాఖ్యలు చేయడం చేస్తూ ఉంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 

 


 ఇక ఇప్పుడు తాజాగా చైనా భారత్ మధ్య సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహిస్తాను  అంటూ మరోసారి ముందుకు వచ్చారు. గత కొంతకాలం నుంచి చైనా భారత్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. యుద్ధానికి సిద్ధం చైనా అధ్యక్షుడు అంటుంటే...  ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ భారత సైన్యం ఎప్పటికప్పుడు సిద్ధమవుత. అదే సమయంలో భారత్ చైనా సరిహద్దు వివాదం లో తాను మధ్యవర్తిత్వం వహిస్తాను అంటు  అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్ళి ముందు కి వస్తే... ఏం  దీనిని భారత అవసరం లేదు మేము చూసుకుంటాం అంటూ చెప్పింది భారత్

 


 అటు చైనా ప్రభుత్వం కూడా మా సరిహద్దు వివాదం మీద మేము చూసుకుంటాం మధ్యవర్తిత్వం అవసరం లేదు అంటూ చెప్పింది. ఇరు దేశాల మధ్య తాను  పెద్ద మనిషి గా ఉండి మధ్య వర్తిత్వం చేస్తాను  అని చెబితే  అవసరం లేదు అంటూ నేరుగానే తిరస్కరించింది భారత్-చైనా. అయితే దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే ట్రంప్  ఏదో గాలిలో ఒక రాయి వేస్తారని ఆ తర్వాత దానిని అసలు పట్టించుకోరు అని అంటున్నారు. మరి ఇప్పుడు చైనా భారత్ తిరస్కరించిన తర్వాత అయిన  ఇలా ఇతర దేశాల విషయంలో వేలు పెట్టడం మానేస్తారా లేదా అన్నది చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: