ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు కు భారీ షాక్ లు తగులుతున్నా విషయం తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి  సర్కార్ 151 సీట్లు భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన తర్వాత... తమ ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయింపుల కు తావు లేదు అంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఎవరైనా  పార్టీ లోకి రావాలి అంటే పదవికి రాజీనామా చేసి రావాలి అంటూ ఒక నిబంధన విధించింది జగన్ సర్కార్. దీంతో జగన్  పార్టీ వైపు రావాలి అనుకున్నప్పటికీ చాలామంది మొదట్లో వెనకడుగు వేశారు. 

 


 కానీ ఆ తర్వాత మాత్రం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు జగన్ సర్కార్ తమ  వైపు ఆకర్షించడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను వైసీపీ పార్టీలో చేర్చుకోదు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీని  వ్యతిరేకిస్తూ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టిడిపి పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసిపి కి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ముగ్గురు కూడా టీడీపీ లో ఏళ్ల నుండి  కొనసాగుతున్న కీలక నేతలు కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోతున్న వారి పట్ల చంద్రబాబు యాక్షన్  తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

 


 ఇప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్లారు. టిడిపి పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ప్రస్తుతం వైసిపి పార్టీ వైపే మద్దతు ప్రకటిస్తున్నారు. అంతే కాకుండా మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పార్టీ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఆంధ్ర రాజకీయాల్లో చర్చ  నడుస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి పార్టీ ని దిక్కరించి అధికారపార్టీకి సపోర్ట్ చేస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న నేరుగా ఇలా పార్టీని ధిక్కరించిన వారిపై కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని సీక్రెటరీ చెప్పటము  జరిగిపోయింది. అయితే చంద్రబాబు ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల   వైసీపీ వైపు వెళ్ళినవారు మళ్ళీ తిరిగి వస్తారా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: