కేరళలో కరోనా విజృంభణ కొనసాగుగుతుంది. లాక్ డౌన్ 4 స్టార్ట్ అయ్యినప్పటినుండి ఆ రాష్ట్రం లో కేసుల సంఖ్య పెరుగుతుండగా ఈ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొత్తగా 58 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఒకరు కరోనా వల్ల మరణించారు. ఈకొత్త కేసులతో కలిపి కేరళ లో మొత్తం కేసుల సంఖ్య 1208కు చేరగా 575 మంది కోలుకొని 9మంది మరణించారు  ప్రస్తుతం 624కేసుల యాక్టీవ్ గా వున్నాయి. 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడు లో ఈఒక్క రోజే  రికార్డు స్థాయిలో 938కేసుల బయటపడ్డాయి. సింగిల్ డే లో ఇప్పటివరకు ఇదే  రికార్డు. ఆ రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 21184 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్ర ,ఢిల్లీ తరువాత అత్యధికంగా తమిళనాడులోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక కర్ణాటక లో ఈరోజు 141కేసులు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్ లో 70కేసులు నమోదయ్యాయి అలాగే తెలంగాణలో ఈరోజు  సాయంత్రం 5గంటల వరకు కొత్తగా 74 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో 180000కరోనా కేసులు నమోదుగా 5000కు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: