ఎవరికైనా కాలం నేర్పే పాఠాలను ఎవరూ నేర్పలేరు. కరోనా మన దేశానికి రాక ముందు కరోనా అనే వైరస్ ప్రమాదకరమైన వైరస్ అని... కరోనా సోకితే చనిపోయే అవకాశాలు ఎక్కువని ప్రజలు భావించేవారు. చైనా కరోనా విషయంలో సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడినా... కేంద్రం చైనా నుంచి విమాన రాకపోకలపై నిషేధం విధించింది. మొదట్లో కరోనా కేసులు నమోదైన సమయంలోని మన దేశంలోని వైద్యుల్లో కూడా అనేక అనుమానాలు నెలకొన్నాయి. 
 
 
ఆ తరువాత కరోనాపై అవగాహన పెరగడం...జనతా కర్ఫ్యూ అమలు... డాక్టర్లు కరోనా సోకకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు కల్పించడం... వారిలో స్పూర్తిని నింపడం.... ఒక విధంగా చెప్పాలంటే కరోనాపై యుద్ధమే చేశాం. కరోనా నియంత్రణ కొరకు కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేసింది. కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసిన సమయంలో తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. 
 
అయితే కేంద్రం ఎప్పుడైతే లాక్ డౌన్ లో సడలింపులు అమలు చేసిందో అప్పటినుంచి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దాదాపు 8,000 కేసులు నమోదయ్యాయంటే దేశంలో ఏ స్థాయిలో కరోనా విజృంభిస్తుందో సులభంగానే అర్థమవుతుంది. కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉండటంతో లాక్ డౌన్ ను సడలిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటును పరిశీలిస్తే 3,14,687 కరోనా వల్ల చనిపోయారు. ఇదే సమయంలో కామన్ కోల్డ్ వల్ల 3,60,600 మంది, మలేరియా వల్ల 3,40,580 మంది, ఆత్మహత్య చేసుకుని 3,53,690 మంది, రోడ్డు ప్రమాదాల వల్ల 3,93,679 మంది, హెచ్.ఐ.వీ వల్ల 2,40,950 మంది, మద్యం వల్ల 5,58,471 మంది, స్మోకింగ్ వల్ల 8,16,400 మంది, క్యానర్ వల్ల 11,67,714 మంది గడచిన మూడు నెలల్లో మరణించారు. కరోనాకు భయపడి జీవన విధానాలను ఆపేసుకుంటే మంచిది కాదని కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: