తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీ వైసీపీలో చేరే ఎమ్మెల్యేల పేర్లు రోజురోజుకు పెరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు వార్తల్లో లేని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ నాయకులతో మంతనాలు పూర్తి అయ్యాయట. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు ముందే ఆయన పార్టీలో చేరాల్సి ఉన్నా, జగన్ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మరో ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. 

IHG


అయితే డైరెక్ట్ గా వైసీపీ కండువా కప్పుకుంటే తమపై అనర్హత వేటు పడుతుందనే ఉద్దేశంతో వైసీపీలో చేరకుండానే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైసీపీ మద్దతు దారులుగా ఉండేందుకు కు వీరంతా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు సీట్లు మినహా మొత్తం వైసిపి తన ఖాతాలో వేసుకుంది. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. ఉండి నుంచి పోటీ చేసిన మంతెన రామరాజు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గెలిచినా దగ్గర నుంచి నియోజకవర్గం లో తన హవా చాటుకునేందుకు అవకాశం లేకపోవడం, మొత్తం వ్యవహారాలన్నీ తన చేతిలో ఓటమి చెందిన వైసీపీ నాయకుడు పి.వి.నరసింహారావు చేతుల మీదుగానే జరుగుతుండడం, ఆయనే షాడో ఎమ్మెల్యే గా చలామణి అవుతూ ఉండడం వంటివి రామరాజుకు మింగుడుపడడంలేదు.


  అలాగే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు పీవీఎల్ నరసింహ రాజు కు ఉన్న సాన్నిహిత్యం వల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెత్తనం చెలాయించేందుకు అవకాశం లేకుండా పోయింది అనేది రామరాజు బాధ. ఈ నేపథ్యంలోనే ఆయన అధికార పార్టీ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: