దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుండి భారీగా కేసులు నమోదవుతుండగా నిన్న ఏకంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 8300కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర లో 2940 , ఢిల్లీలో 1163, గుజరాత్ లో 412, తమిళనాడు లో 938 కేసులు నమోదయ్యాయి. ఈకేసులతో కలిపి  నిన్నటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 181000కు చేరింది. కేవలం పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రమే కాదు కరోనా మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతుంది. నిన్నటివరకు దేశ వ్యాప్తంగా కరోనా తో మరిణించిన వారి సంఖ్య 5000కు చేరింది. 
 
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6000000కు చేరగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న  దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతుంది. ఆదివారం తో జర్మనీ , ఫ్రాన్స్ ను దాటేసి ఇండియా 7వ స్థానం లోకి  రానుంది. మరోవైపు నేటితో 4వ దశ లాక్ డౌన్ ముగియనుండగా జూన్ 30వరకు లాక్ డౌన్  పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది అయితే ఈ లాక్ డౌన్ 5.0 కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితం కానుంది అలాగే ఈ లాక్ డౌన్ లో కూడా కేంద్రం సడలింపులు ప్రకటించింది.
 
జూన్ 8నుండి సినిమా హాళ్లు , దేవాలయాలు , రెస్టారెంట్లు , హోటళ్లు ,మాల్స్ తెరవడానికి అనుమతినిచ్చింది అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం నిషేధం విధిం చింది. ఇక విద్యాసంస్థల విషయం లో జులై లో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: