ప్రపంచవ్యాప్తంగా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంను నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి పొగాకు వ్యతిరేక దినోత్సవంను నిర్వహిస్తోంది. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని నిర్వోహిస్తోంది. గడచిన మూడు నెలల్లో కరోనా మహమ్మారి భారీన పడి 3,14,687 మంది చనిపోగా స్మోకింగ్ వల్ల 8,16,400 మంది చనిపోయారు. 
 
ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి కంటే స్మోకింగ్ వల్ల చనిపోయిన వారే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నారంటే స్మోకింగ్ శరీరానికి ఎంత ప్రమాదకరమో సులభంగా అర్థమవుతుంది. ధూమపాన ప్రియులలో ఎక్కువ మంది సిగరెట్ తాగుతూ ఉంటారు. సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ శాతం క్రమంగా తగ్గుతుంది. సిగరెట్ అనేది ఒక వ్యసనం. మొదట సరదాగా మొదలైనా చివరకు వదిలించుకోలేని వ్యసనంగా మారుతుంది. 
 
రోజువారీ క్యాన్సర్ మరణాల్లో 30 శాతం పొగాకు ఉత్పత్తుల వల్లే సంభవిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒక సిగరెట్ పొగలో దాదాపు 4000 రసాయనాలు ఉంటాయి. వీటిలో 43 రకాల క్యాన్సర్ కారకాలతో పాటు 400 రకాలు విషపూరితమైనవి. ఒక్కసారి సిగరెట్ ను పీల్చితే 0.25 ఔన్సుల బూడిద విడుదలవుతుంది. సిగరెట్లు ఎక్కువగా తాగేవారి ఊపిరితిత్తుల్లో బూడిద పేరుకుపోయి, నల్లగా తయారవుతాయి. 
 
రోజూ సిగరెట్ తాగడం వల్ల ఆక్సిజన్‌ అందక అవయవాలు చలనరహితం అవుతాయి. చివరకు ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. సిగరెట్ ఎక్కువగా తాగే వారిలో గుండె, మూత్రపిండాలు, కళ్లు, నోరు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ధూమపానం ఆర్థిక, ఆరోగ్య నష్టాలను కలిగిస్తుంది. అందువల్ల సిగరెట్ కు, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సిగరెట్ ను ముందునుంచే అలవాటు చేసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. సో.. బీకేర్‌ఫుల్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: