ఒక్కో నాయకుడు ఒక్కో విధమైన ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు. ఒక్కో నాయకుడు ఒక్కో ఫార్ములాను ఫాలో అయిపోతుంటారు. అందరికంటే తాము స్పెషల్ అని నిరూపించుకుంటూ మెరుగైన ఫలితాలు సాధించి చూపించాలని తహతహలాడుతుంటారు. తెలంగాణ బీజేపీ రథసారధిగా పగ్గాలు చేపట్టిన యువ నాయకుడు, ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు ఆ విధంగానే కనిపిస్తున్నారు. తెలంగాణ లో బిజెపి బండి స్పీడ్ అమాంతం పెంచాలనే పనిలో పడ్డారు. ఆయన అధ్యక్షుడు గా నియమించబడిన తరువాత వరుసగా అనేక ప్రజా ఉద్యమాలు, కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వచ్చే ఎన్నికల నాటి కి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నిత్యం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోనే ఉంటున్నారు. కేంద్ర అధికార పార్టీ గా బిజెపి ఉన్నా, తెలంగాణలో బలపడకపోవడానికి  కారణాలను ఆయన వెతుకుతున్నారు. అంతకు ముందు బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని, పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకుంది.

IHG


 పార్టీ పరిస్థితి మెరుగయ్యేలా ఉందని భావించిన అధిష్టానం బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించి ఆయనకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చింది. దీంతో ఆయన స్పీడ్ పెంచారు. జూన్ మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, పార్టీ నాయకుల్లో వేడి పెంచే విధంగా బండి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక విషయానికొస్తే బిజెపి తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్న్యాయ పార్టీగా ఎదుగుతోందని నమ్మకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దఎత్తున నాయకులు బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి ఇప్పటికే చాలామంది నాయకులు వచ్చి చేరారు. 

 

కాకపోతే మొదటి నుంచి బిజెపి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పాటిస్తూ వస్తున్న బండి సంజయ్ వలస నాయకుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే నమ్మకంతో ఉన్నారు. వారిని చేర్చుకోవడం వల్ల అనవసర తలనొప్పులు రావడం తప్పిస్తే వారి వల్ల పార్టీకి కలిసి వచ్చేది ఏమీ లేదని, అందుకే వలసలను పెద్దగా ప్రోత్సహించకూడదు అని డిసైడ్ అయ్యారట. పార్టీలో ఉన్న పార్టీ నాయకులతో నే తెలంగాణ బిజెపి ని ముందుకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఉన్నారట. అలాగే యువతను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వలస నాయకులతో పార్టీని నింపకూడదు అనే ఆలోచనలో ఆయన కనిపిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: