ఏపీలో గత 24 గంటల్లో 9,504 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 70 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,944కి చేరింది. కొత్త కేసుల్లో మూడింటికి కోయంబేడు లింకు ఉన్నట్టు గుర్తించారు. ఇవాళ 55 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,092కి పెరిగింది.  ఇక, విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 406 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ప్రస్తుతం 217 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో ముగ్గురికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగింది.

 

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 227 మంది ఉద్యోగులు  ప్రత్యేక బస్సుల్లో అమరావతి చేరుకున్నారు. అనంతరం వీరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా, గురువారం నుంచి వీరంతా విధులకు హాజరవుతున్నారు.  అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. వీరిలో సచివాలయంలోని ఓ శాఖలో పనిచేసే ఒకరు, గుంటూరులోని ఓ శాఖ ప్రధాన కమిషనర్‌ ఆఫీస్ లో పనిచేసే ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. 

 

కరోనా నిర్ధరణ పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. దీంతో సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి వారం పాటు సచివాలయ ఉద్యోగులందరికీ ‘ఇంటి నుంచే పని’ సౌకర్యం కల్పించి, అందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఉన్నతాధికారులను కోరారు. కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలిన వారిని మాత్రమే విధుల్లోకి అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: