చెక్ ఫోర్జరీ కేసులో అరెస్టు కాబడిన ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ప్లాయిడ్ పోలీసు కస్టడీలోనే చనిపోయాడు. సోమవారం రోజు మిన్నెసోట నగరంలో నడిరోడ్డుపై నల్ల జాతీయుడైన జార్జ్ ప్లాయిడ్ ని కింద పడేసి మెడ మీద మోకాళ్ళతో గట్టిగా నొక్కి చనిపోయేంతవరకు అలాగే ఉన్నాడు. ఐతే ఈ మిన్నెసోట పోలీస్ ఆఫీసర్ ఇతన్ని మర్డర్ చేస్తుండగా కొంతమంది నల్లజాతీయులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తదనంతరం ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఈ దారుణమైన సంఘటన జరిగేటప్పుడు హత్య చేసిన పోలీస్ ఆఫీసర్ తో పాటు ముగ్గురు అక్కడే ఉన్నారు. వైరల్ ఐన వీడియోలో నిందితుడు జార్జ్ ఫ్లాయిడ్ ఊపిరి ఆడడం లేదు అని, తనని వదిలేయాలని పోలీసు అధికారిని కోరడం మనం చూడవచ్చు. తన చివరి మాటలు అందరికీ గుండె పగిలేలా చేసాయి. అమెరికా దేశంలో నల్లజాతీయులు అంతా కలిసి పోలీసుల దుశ్చర్యపై నిరసనలను ఆందోళనలను చేపట్టారు.


ఈ దారుణమైన సంఘటన లో పాల్గొన్న నలుగురు పోలీసులను మొదటిగా ఉద్యోగం నుంచి తొలగించింది అమెరికా ప్రభుత్వం. ఐతే శుక్రవారం రోజు జార్జ్ ప్లాయిడ్ ని చంపిన ఆఫీసర్ పై థర్డ్ డిగ్రీ మర్డర్ కేసు కింద అరెస్టు చేశారు. అయితే అతన్ని అరెస్టు చేసినప్పటికీ జార్జ్ మరణాన్ని ఖండిస్తున్న అనేకమంది అమెరికా దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో హింసాత్మక చర్యలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే హింసాత్మక చర్యలకు పాల్పడే 1500 మందినిపైగా పోలీసులు అరెస్టు చేశారు. 


ఈ క్రమంలోనే శనివారం రోజు న్యూయార్క్ నగరంలో నిరసనకారులు పోలీసు వాహనాలను ఆపారు. అయితే ఒక పోలీసు వాహనం అడ్డుగా వచ్చిన నిరసనకారుల లోకి దూసుకెళ్ళగా పదిమంది పైచిలుకు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట ప్రత్యక్షం కాగా... న్యూయార్క్ పోలీసుల తీరుపై చాలామంది మండిపడుతున్నారు. ఇకపోతే అమెరికాలో ఇప్పటి వరకూ ఎంత మంది నల్లజాతీయులు పోలీసుల చేతిలో దారుణం గా చంపబడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: