తాజా పరిశోధనలలో ప్రతి రోజు వేడి నీళ్లతో స్నానం చేస్తే గుండెకు సంబంధించిన వ్యాధులు రావని తేలింది. గుండెపోటు లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు వేడినీటితో స్నానం చేయాలని పరిశోధకులు తేల్చారు. వారంలో ఎక్కువసార్లు వేడి నీటితో స్నానం చేస్తే యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది. వేడి నీళ్లతో స్నానం చేస్తే హైపర్ టెన్షన్ లాంటి అనారోగ్య సమస్యలు అస్సలు తలెత్తవు. వేడినీళ్లతో స్నానం చేయడం వలన మంచి నిద్ర లభించడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సుదీర్ఘకాలం పాటు వేడి నీటితో స్నానం చేయడం వలన గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు సన్నగిల్లి పోవడం విశేషం. 


ఈ పరిశోధనలో 45 నుండి 59 సంవత్సరాల వయస్సు గల 61 వేల మంది వ్యక్తులను పరీక్షించారు. 1990 లో ప్రారంభమైన ఈ పరిశోధనలో 43 వేల మంది మధ్య వయస్కులు తమ స్నానానికి సంబంధించిన అలవాట్లను డాక్టర్స్ సేకరించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారు ఏ ఆహారం తీసుకుంటారో, వ్యాయామం చేస్తారో లేదో లాంటి పూర్తి వివరాలు సేకరించారు. 2009వ సంవత్సరం వరకు వీళ్లందరినీ ప్రతిక్షణం పరీక్షించారు. 


ఆ పరీక్షలలో వేడి నీళ్లతో స్నానం చేసిన వారి ఆరోగ్యం మంచిగా ఉందని తేలింది. దాదాపు 20 సంవత్సరాల కాలంలో 2097 మంది గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయారు. ఐతే గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయిన వారంతా స్నానం చేసే అలవాటు లేనివారని తేలగా... వేడినీటితో స్నానం చేసేవారికి హృదయ సంబంధిత రుగ్మతలు అస్సలు లేవని తేలింది. వేడి నీళ్లు శరీరంపై పోసుకోవడం వలన 35 శాతం గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. మరింత వేడిగా ఉన్న నీళ్లతో కాకపోయినా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు అని పరిశోధకులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: