ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ వాక్సిన్ కోసం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు రాత్రి, పగలు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాల బట్టి చూస్తే ఈ ఏడాది వాక్సిన్ వచ్చే అవకాశం లేదు అనే వాదన ప్రపంచ స్థాయి లో బలంగా వినబడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన ఎంఆర్.పీ.ఏ కార్పొరేషన్ సంస్థ మహమ్మారి విరుగుడుకి ఇంజక్షన్ తయారు చేసినట్లు ప్రకటించింది. శరీరంలో ప్రవేశించే వైరస్ పై పోరాడేందుకు అవసరమైన యాంటీ బాడీస్ తో ‘హ్యుమన్ కోవిడ్19 ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్’ పేరుతో ఇంజక్షన్ తయారు చేసినట్టు ఎంఆర్.పీ.ఏ ప్రకటించింది.

IHG

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా గుర్తింపు ఇచ్చిందని క్లినికల్ ట్రైల్స్ త్వరలో జరిపేందుకు రెడీ అవుతున్నట్లు సంస్థ చైర్మన్ విశాఖపట్టణానికి చెందిన డాక్టర్ శ్రీహరి తెలిపారు. అందుబాటులోకి వచ్చిన ఇంజక్షన్ మహమ్మారి వైరస్ నిర్ధారణ రాకముందు అదేవిధంగా నిర్ధారణ అయిన తరువాత కూడా మనిషి శరీరనికి ఇవ్వవచ్చు అని తెలిపారు. ఇంజక్షన్ లో ఉండే ఇమ్యూనో గ్లోబిన్స్ బాడీలోకి పంపితే అవి మహమ్మారి వైరస్ తో పోరాడుతాయని వివరించారు.

IHG

వ్యాక్సిన్ వచ్చేలోపు కొంతమంది ప్రాణాలను అయినా సేవ్ చేయాలనే ఈ ఇంజక్షన్ రూపొందించామని డాక్టర్ శ్రీహరి అన్నారు. ముందుగా 50 మందిపై క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసి రిపోర్టు అందించాలని ICMR కోరిందని అన్నారు. దీంతో ఈ వార్త అంతర్జాతీయస్థాయిలో వైరల్ కావటంతో ప్రపంచమంతా ఈ ఇంజక్షన్ పనితీరుపై నమ్మకం పెట్టుకొని ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: