ఏపీ రాజకీయాలు అందరికీ ఆకట్టుకుంటున్నాయి. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ ఢీ అంటే ఢీ అన్న పోరు సాగుతోంది. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీ రెండూ కూడా ఎక్కడా తగ్గడంలేదు. అయితే మీడియాలోనే ఈ రకమైన పోటీ కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలోకి వెళ్తే వైసీపీ ఏడాది గడచినా కూడా బలంగానే కనిపిస్తోంది.

 

ఆ పార్టీకి గడచిన ఎన్నికల్లో వచ్చిన బంపర్ మెజారిటీ తో పాటు, ఆ మోజు కూడా ఇంకా తగ్గలేదు అనిపిస్తోంది. దీనికి కారణం జగన్ పేద వర్గాలను అండగా ఉండడం. వెల్లువలా సంక్షేమ పధకాలు అమలు చేయడం. జగన్  గత ఏడాదిగా పందేరాల  పేరిట పధకాలు అందిస్తూనే ఉన్నారు. ఎక్కడా ఆయన ఈ విషయంలో వెనకడుగు వేయలేదు.

 

ఏపీకి ఆదాయం లేకపోయినా, కరోనా మహమ్మారి తరుముకు వచ్చినా జగన్ మాత్రం తన హామీలను అమలుచేస్తూనే ఉన్నారు. అదే విధంగా తానున్నాను అని గట్టిగా చెప్పగలుగుతున్నారు. అదే ఇపుడు ఆయనకు కలసివస్తోంది. మరో వైపు చూసుకుంటే ఏడాది కాలంలో ఏపీలో ప్రతిపక్షం బలం ఏ మాత్రం పెరగలేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి.

 

తెలుగుదేశం పార్టీ గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయేనాటికి కూడా బలంగానే ఉంది. ఆ పార్టీ నలభై శాతం ఓట్లు సాధించింది. అయితే ఈ ఏడాది కాలంలోనే సీన్ మారింది. ఆ పార్టీలో నైరాశ్యం గూడు కట్టుకోవడం తో పాటు పార్టీ నాయకులు పెద్దగా నోరు మెదపకపోవడం ఇబ్బందిగా మారింది.

 

ఇక జగన్ ఓవైపు దూకుడుగా ఉంటే టీడీపీ కేవలం మీడియాను ఆసరాగా చేసుకుని యుధ్ధం చేస్తోందని అంటున్నారు. ఇది బయటకు కనిపించడానికి బాగానే ఉన్నా కూడా క్షేత్ర స్థాయిలో ఢీ అంటే ఢీ అనే సీన్ లేదని విశ్లేషణలు ఉన్నాయి. అందువల్ల ఎపుడు లోకల్ బాడీ ఎన్నికలు జరిగినా కూడా వైసీపీ విజయం ఖాయమని అంచనాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో మరిన్ని మార్పులు వస్తాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: