ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ తన మార్క్ పాలన ఉండేలా నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ గత టీడీపీ ప్రభుత్వం లో కానీ ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పరిపాలన చేస్తున్నారు. ఎటువంటి సమస్య అయినా అధికారులతో చర్చించి నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ సమస్య ఎక్కడ ఉందో అక్కడ పరిష్కారం చూపించే దిశగా జగన్ నిర్ణయాలు తీసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం.

IHG

జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో అద్భుతమైన నిర్ణయం ఏమిటంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేరటం. వీటిలో పైగా ప్రభుత్వ పింఛన్లు ఇంటికి వచ్చి లబ్ధిదారులకు చేకూర్చడం. ఇటువంటి సమయంలో తాజాగా జగన్ సర్కార్ పింఛన్లు ఈ విధంగా అమలు చేస్తూనే సరికొత్త నిర్ణయం జగన్ సర్కార్ తీసుకుంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే పెన్షన్ లేని వారు అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్నా వారికి ఐదు రోజులకే పింఛన్ మంజూరు అయ్యే బృహత్తర కార్యక్రమానికి జూన్ 1 నుంచి జగన్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది. 

IHG

ఎవ‌రైనా పింఛ‌న్‌ కు ద‌ర‌ఖాస్తు చేస్తే వాటిని ప‌రిశీలించి అర్హ‌త ఉంద‌ని అధికారులు భావిస్తే కేవ‌లం ఐదు రోజుల్లోనే వారిని అర్హులుగా ఎంపిక చేసే విధానాన్ని జగన్ తీసుకూరావడం జరిగింది. దీంతో… సామాన్య ప్ర‌జ‌ల‌కు ఇది ఎంతో ఊర‌ట‌నిచ్చే విధానమ‌ని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క గత ప్రభుత్వంలో పింఛన్ కోసం రోజుల తరబడి కాళ్లరిగేలా అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగకుండా జగన్ అద్భుతమైన నిర్ణయం తీసుకుని మా పై భారాన్ని తగ్గించాలని సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: