అగ్రరాజ్యమైన అమెరికా కరోణ వైరస్ తో సతమతమవుతూ ఉంటే... ప్రస్తుతం అక్కడ మరోక కొత్త సమస్య ఎదురయ్యింది. ఒక నల్లజాతీయుడిని మినిపోలిస్ లో ఓ పోలీసు అధికారి కర్కశంగా ప్రవర్తించి చివరికి అతని మరణానికి కారణం అవ్వడం జరిగింది. ఈ ఘటనపై ప్రజలు, నల్లజాతీయులు ప్రస్తుతం నిరసనలు అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో చేపడుతున్నారు. ఈ ఉద్యమం 2014లో రగిలిన " ఐ కాంట్ బ్రీత్ " ఉద్యమానికి కొనసాగింపుగా మారిందనే చెప్పాలి. ఇక దాదాపు ఇరవై ఐదు రాష్ట్రాల నగరాలలో వేలకు సంఖ్యలలో రోడ్ల పైకి వచ్చి నిరసన గళాలు చేపడుతున్నారు. ఈ నిరసనలో నల్ల జాతీయులకు చాలామంది శ్వేత జాతీయులు కూడా మద్దతు పలుకుతుండగా... ప్రస్తుతం ఇది ఈ ప్రభుత్వానికి మరో పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి. 

 


ఇదే తరహాలో 2014లో న్యూయార్క్ నగరంలో ఎరిక్ గార్నర్ అనే భారతీయుడుని నలుగురు పోలీసులు అక్రమంగా సిగరెట్లు అమ్ముతున్నాడనే కారణంతో చేతులు వెనక్కి కట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ సంఘటనలో ఒక పోలీసు గవర్నర్ గొంతు పట్టు కోవడంతో అతడు ఐ కాంట్ బ్రీత్ అని పదే పదే అన్న కూడా పోలీసులు కనికరించలేదు. ఇక అతన్ని ఆస్పత్రికి తరలించే తరుణంలో ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో అతను మృతి చెందడం జరిగింది. అప్పటిలో ఈ సంఘటనపై నల్లజాతీయులు ఐ కాంట్ బ్రీత్ అంటూ ఉద్యమాన్ని చేయడం కూడా చూశాము.

 


ఇప్పుడు కూడా ఇదే తరహాలోనే మినియా పోలీసులలో నకిలీ పత్రాలు ఉపయోగిస్తున్నాడు అనే తరుణంలో చార్జింగ్ స్లయిడ్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. ఒక పోలీస్ అతని మెడపై కర్కశంగా కాలితో తొక్కగా ఊపిరాడక చార్జింగ్ స్లయిడ్ మృతి చెందాడు. వాస్తవానికి పోలీసులకు లాయిడ్ సహకరించిన కూడా పోలీస్ అధికారులు కావాలనే అతని చంపేశారని వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. దీంతో మరోసారి ఐ కాంట్ బ్రీత్ నిరసనను మొదలు పెట్టారు. అలాగే నల్లజాతీయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఒకే తరహా ఘటనలు లాయిడ్ జరగడంతో నల్లజాతీయులతో పాటు శ్వేతజాతీయులు కూడా కొందరు మద్దతు పలకడం జరిగింది. దీనితో పైన ఉన్న అధికారులు అతడిపై దాడి చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక రోజురోజుకి ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో అమెరికా ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ను రంగంలోకి దించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: