దక్షిణాది రాష్ట్రాలను కరోనా వణికిస్తుంది. గత కొద్దీ రోజులనుండి అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదుగా  ఈరోజు అంతకు మించి కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా తమిళనాడు లో ఈఒక్క రోజే 1149కేసులు నమోదుకావడం గమనార్హం అంతేకాదు ఈరోజు 13మంది కరోనా తో మరణించారు. ఆరాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,333కు చేరగా ఇప్పటివరకు 173మంది కరోనా తో మరణించారు. ఇక కర్ణాటక లో ఈఒక్క రోజే  299కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 3000దాటింది. కేరళ లో ఈరోజు కొత్తగా 61కేసులు నమోదయ్యాయి. ఈకొత్త కేసులతో కలిపి కేరళ లో మొత్తం కేసుల సంఖ్య 1269కు చేరగా 590 మంది బాధితులు కోలుకొని 9మంది మరణించారు ప్రస్తుతం 670కేసులు యాక్టీవ్ గా వున్నాయి. 
 
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 98కేసులు నమోదయ్యాయి దాంతో మొత్తం కేసుల సంఖ్య 3042కు చేరింది ఇందులో 845కేసులు యాక్టీవ్ గా ఉండగా 62మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక తెలంగాణలోనైతే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న సాయంత్రం 5గంటల నుండి ఈరోజు రాత్రి 8గంటల వరకు వరకు కొత్తగా 199 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈకేసుల తో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  2698కి చేరగా అందులో 1428మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల  82మంది మరణించగా ప్రస్తుతం 1188కేసులు యాక్టీవ్ గావున్నాయి. 
 
.ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో 190000కరోనా కేసులు నమోదుగా 5000కు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.ఈరోజు తో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 4ముగియనుండగా రేపటినుండి లాక్ డౌన్ 5 అమలులోకి రానుంది. జూన్ 30వరకు ఈలాక్ డౌన్ కొనసాగనుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: