గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్  వేసిన పిటిషన్పై విచారణ జరిపిన  ఏపీ హైకోర్టు అటు ప్రభుత్వం ఇటు నిమ్మగడ్డ వాదనలను విన్న తర్వాత... జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు షాక్ ఇచ్చే విధంగా తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా  తీసుకోవాలి అంటూ జగన్ సర్కార్ ను  ఆదేశించింది ఏపీ హైకోర్టు. 

 


 ఈ నేపథ్యంలోనే సెక్రటరీ నుంచి ఉత్తర్వులు రాగా  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్యోగంలో చేరాను అని తెలిపారు. మళ్ళీ సెక్రటరీ ప్రభుత్వం అనుమతి లేదు అంటూ ఉత్తర్వులను రద్దు చేయడంతో... కోర్టు ధిక్కరణ  కింద మళ్లీ కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు  నిమ్మగడ్డ. మరి ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కోర్ట్ వార్నింగ్ ఇస్తుందా  లేదా  ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తుంద అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఒక కీలకమైన పాయింట్ ప్రస్తుతం తెరమీదికి వచ్చింది. కోర్టు తీర్పు లో ఉన్న 318 పాయింట్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. 

 

 

 నిజంగానే ఇది  అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. డైరెక్ట్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తనకి తానుగా ఉద్యోగంలో చేరాలని  హైకోర్టు ఆదేశించలేదు ప్రభుత్వం నిమ్మగడ్డను మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రోసిజర్  కొనసాగాలంటే ఏపీ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం పెట్టి.. అందులో చర్చించి ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు రమేష్ కుమార్ ను ఉద్యోగంలో కొనసాగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇక క్యాబినెట్ సమావేశం కూడా అత్యవసరంగా చేపట్టాలని కూడా కోర్టు ఆదేశించలేదు . ఇక ఈ విషయంలో న్యాయస్థానం అటు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తుందా లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొందరపడ్డారు  అని మొట్టికాయలు వెళ్తుంద చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: