గత కొన్ని రోజుల నుంచి భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఏకంగా చైనా కు సంబంధించిన సైనికులు భారత సైనికుల మధ్య సరిహద్దుల్లో గొడవ కూడా జరిగింది . ఇక ఈ గొడవలు అటు భారత సైనికులతో పాటు చైనా సైనికులు కూడా గాయపడ్డారు. ఈ ఘటన మొన్నటివరకు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే చైనా భారత్ మధ్య ఎప్పుడూ యుద్ధం తలెత్తుతోంది అన్నది మాత్రం ఎవరూ చెప్పలేని విధంగా ఉంది. ఇప్పటికే చైనా సైన్యం మొత్తం సరిహద్దుల్లో మోహరించింది. అయితే ప్రస్తుతం విశ్లేషకులకు చైనా సైన్యం పై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 

 


 వియత్నాం తో యుద్ధం తర్వాత చైనా ఇప్పటివరకు ఒక్క మిస్సైల్ ని కూడా వాడలేదు. కేవలం మల్లయుద్ధం లాంటి యుద్ధం చేసింది తప్ప మిసైల్  వాడి యుద్ధం చేసిన దాఖలాలు మాత్రం లేవు. అయితే చైనా మిత్ర దేశమైన పాకిస్థాన్ తో మాత్రం ఇప్పటికే భారత్ ఎన్నో సార్లు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. కొన్నిసార్లు పాక్ భారత్ మధ్య దాడి చేసి కాల్పులు జరగింది.  అదే సమయంలో పాక్ కి  బుద్ధి చెప్పడానికి భారత్ కూడా కాల్పులు జరపడం జరిగింది. కానీ ఇప్పటివరకు భారత్-చైనా మధ్య మాత్రం ఒక్కసారి కూడా కాల్పులు జరిగిన దాఖలాలు లేవు. 

 


 అయితే మామూలుగా చైనా ప్రపంచంలోనే ఎక్కువ ఆయుధ కర్మాగారం మా దేశం లోనే ఉంది అంటూ చెప్పుకుంటుంది. కానీ ప్రస్తుతం చైనా మాత్రం రష్యా లాంటి దేశాల నుంచి ప్రస్తుతం మిస్సైల్ ని కొనుగోలు చేస్తోంది. దీనికి కారణం ఏమిటి అన్న దానిపై మాత్రం ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు దీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇక మరో విషయం ఏమిటి అంటే చైనా కు సంబంధించిన సైనికులకు ఇప్పటివరకు ఎలాంటి పని చేసిన అనుభవం లేదు... కొన్ని కొన్ని సార్లు వివిధ దేశాలు సంయుక్తంగా ఆయుధాల పరీక్షలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పటివరకు అలాంటి పరీక్షల్లో మాత్రం చైనా సైన్యం పాల్గొనలేదు. అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున రష్యా దేశం నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తుంది చైనా. అయితే దీనిపై మాత్రం విశ్లేషకులు తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: