ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం రోజుకో మలుపు తిరుగుతూ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.  ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం  ఆంధ్ర రాజకీయాల్లో ప్రతి రోజు కొత్త మలుపు తిరుగుతూ వస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై ఏపీ హైకోర్టులో కూడా విచారణ జరుగుతుంది. అయితే ఇటీవలే నిమ్మగడ్డ రమేష్  కుమార్ కేసులో తుది తీర్పు వెల్లడించింది ఏపీ హైకోర్టు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి అంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

 


 అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ఓపెన్  అయినట్లు తెలుస్తోంది. ఆయన సరికొత్త అస్త్రం తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు ధిక్కార  పిటిషన్  హైకోర్టు లో వేయనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కోర్టులో సెలవులు ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా ఈ పిటిషన్ వేస్తారా... సెలవుల తర్వాత వేస్తారా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది . అయితే ఏపీ హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను  మళ్లీ పదవి లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఎన్నికల కమిషనర్గా ఇమీడియట్ గా  తాను బాధ్యతలు స్వీకరించాను అంటూ చెప్పుకొచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. 

 


 దీనికి అనుగుణంగా సెక్రటరీ కూడా ఆదేశాలు జారీ  చేశారు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే... ఏపీ హైకోర్టు కేవలం ప్రభుత్వానికి మాత్రమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీ  మళ్లీ ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశాలు జారీ చేసిందనీ ... స్వయంగా  నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా తీసుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రొసీజర్  పాటిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. నిమ్మ గడ్డను మాత్రం  డైరెక్ట్ గా వెళ్లి ఉద్యోగంలో చేరాలని  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు తెలప లేదు అంటున్నారు. అయితే నిమ్మగడ్డ నియామకానికి సంబంధించి సెక్రెటరీ ప్రొసీజర్ సిద్ధం చేయగా మళ్లీ దానిని రద్దు చేశారు.  ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కూడా ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం నిమ్మగడ్డ వ్యవహారంలో అటు ప్రభుత్వం ఇటు వైద్యులూ స్పష్టత మాత్రం లేనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: