తెలంగాణ అంతట జూన్ 7వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలుకానుంది. ఈమేరకు లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశాలు జారీచేసింది అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కేంద్రం ప్రకటించినట్లు జూన్ 30వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలంగాణ సర్కార్ పేర్కొంది.
 
ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్.. సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులకు అనుమతివ్వాలని, కటైన్మెంట్ జోన్లలో మాత్రం కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. షాపులను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని కోరారు. ఇతర రాష్ట్రాలకు రాకపోకల విషయంలో కూడా ఎలాంటి నియంత్రణ అవసరం లేదని తెలిపారు. 
 
 ఇదిలావుంటే తెలంగాణలో ఈరోజు రికార్డు స్థాయిలో  కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈఒక్క రోజే  కొత్తగా 199 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5 మరణాలు చోటుచేసుకున్నాయి. ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే 122 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  2698కి చేరగా అందులో 1428మంది బాధితులు కోలుకోగా 82మంది మరణించగా ప్రస్తుతం1188కేసులు యాక్టీవ్ గా వున్నాయి.
 
ఇక దేశ వ్యాప్తంగా ఈఒక్క రోజే రికార్డు స్థాయిలో 8700 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. దాంతో ఇండియాలో కరోనా కేసులసంఖ్య 190000 దాటింది.ఇప్పటివరకు కరోనా తో 5400మంది చనిపోయారు. కాగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇండియా ప్రస్తుతం 7వస్థానంలో కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: