ప్రపంచంలో ఉన్న దేశాలు కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్నయి. చాలా దేశాలు ప్రజలను కాపాడటం కోసం లాక్ డౌన్ అమలు చేస్తున్న తరుణంలో ప్రజలు ఇంటినుండి బయటకు రావటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ బయటకు వచ్చినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముఖానికి మాస్కు ధరించి వస్తున్నారు. ఒకరిని ఒకరు టచ్ చేయకుండా దగ్గు మరియు తమ్ములు వంటివి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ రాకముందు వరకు ప్రపంచం ఒకలా ఉంటే వైరస్ వచ్చాక ప్రస్తుత ప్రపంచం మరోలా ఉంది.

IHG

ఇటువంటి పరిస్థితుల్లో కరోనా భయంతో ప్రజలంతా వణికిపోతుంటే మాత్రం నోయిడా ప్రాంతంలో వ్యభిచారమే వ్యాపారంగా మారటంతో దాన్ని కంట్రోల్ చేయలేక పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. నోయిడా ప్రాంతంలో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో గుట్టుగా వ్యభిచారం జరగటంతో పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ వ్యభిచారం జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని సోదాలు నిర్వహించారు.

IHG

వారి సోదాల్లో ఆరుగురు పట్టుబడ్డారు. వారిలో ఇద్దరు యువతులు ఉన్నారు. వీరందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు . ఇదే సమయంలో వారికి కరోనా వైరస్ పరీక్షలు చేయించినట్లు దీంతో కొంతమందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు వారితో ఎవరు వ్యభిచారం చేశారు, ఎవరికీ వైరస్ సోకింది అన్న దాని విషయంలో క్లారిటీ లేకపోవడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నరట. పోలీసులు ఎంత కంట్రోల్ చేసిన నోయిడా ప్రాంతంలో వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: