టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తానే అంతా అన్నట్లు పాలించిన చంద్రబాబు...ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చాక నీతులు చెప్పడం మొదలుపెట్టారు. జగన్ ఓ నియంతలా పాలన చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. గత ఐదేళ్లు ఆయనే అలాంటి పాలన అందించి, ఇప్పుడు ఆ మాటని జగన్‌కు ఆపాదిస్తున్నారు. ఇక జగన్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వరుసపెట్టి విమర్శలు చేస్తున్నారు.

 

అసలు వైసీపీ నేతలు వ్యవస్థలనే నాశనం చేసే స్థితికి వచ్చారని, ఏడాది పాలనలోనే ఇంత గూండాయిజాన్ని ఎన్నడూ చూడలేదని మాట్లాడుతున్నారు. మీడియాపై ఉక్కుపాదం, రాజధాని, మండలి రద్దు, ఎస్‌ఈసీ తొలగింపు.. ఇవన్నీ తమ మాటే చెల్లుబాటు కావాలనే గుండా మనస్తత్వానికి నిదర్శనాలని విమర్శిస్తున్నారు. హైకోర్టు కట్టడి చేయకపోతే రాష్ట్రం ఏమై ఉండేదా అని భయం వేస్తోందని, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల భాష చూస్తుంటే వీళ్ల కంటే వీధి రౌడీలు నయం అనిపిస్తోందని చెప్పారు.

 

అయితే ఈ మాదిరిగా బాబు చేసిన విమర్శలకు వైసీపీ శ్రేణులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాయి. ఎవరి హయాంలో గుండాయిజం నడిచిందో తెలుసని, ఎవరు అధికారులని బండ బూతులు తిట్టారో, కొట్టారో తెలుసని అంటున్నారు. ఇక జగన్‌ని, వైసీపీ నేతలనీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా తెలుసని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలు ఎంత రచ్చ చేసాయో ప్రజలందరూ చూశారని, సొంత వాళ్ళకే పథకాలు ఇచ్చుకున్నారని, కానీ జగన్ మాత్రం పార్టీలని చూడకుండా పథకాలు అందిస్తున్నారని చెబుతున్నారు.

 

బాబు హయాంలో మీడియాపై ఉక్కుపాదం మోపిన విషయం కూడా తెలుసని, జగన్ మండలి రద్దు, ఎస్‌ఈసికని ఎందుకు తప్పించుకోవాలనుకున్నారో ప్రజలకు బాగా తెలుసని, కాబట్టి అప్పుడేమో నియంతలా వ్యవహరించి, జగన్ పాలనపై విమర్శలు చేస్తూ, బాబు నీతులు చెప్పడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ఐదేళ్లు నియంత పాలన చేశారు కాబట్టే, ప్రజలు జగన్‌ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారని కౌంటర్ వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: