సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాలనుకునే వారికి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో జూన్ 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. లాక్ డౌన్ 5.0 నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో మాత్రం జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. నిన్న రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి నుంచి ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. లాక్ డౌన్ 5.0 నిబంధనలు అనుసరించి రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే జనసంచారంపై ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. 
 
వ్యాపార సముదాయాలు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు. ప్రభుత్వం మందుల దుకాణాలకు, ఆస్పత్రులకు ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చింది. ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఇకనుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చేందుకు ఎటువంటి అనుమతి, పాస్ లు అవసరం లేదు. 
 
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు చేసే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఈ వార్త శుభవార్త అనే చెప్పవచ్చు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ నిబంధనలు యథాతథంగా అమలు కానున్నాయని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కేంద్రం ఐదో విడత లాక్ డౌన్ ను ప్రకటించడంతో నిన్న సమీక్ష నిర్వహించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
జూన్ మొదటివారంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కావచ్చని సమాచారం అందుతోంది. మరోవైపు రాష్ట్రంలో నిన్న రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 199 కరోనా కేసులు నమోదు కాగా ఐదుగురు కరోనా భారీన పడి మృతి చెందారు. నమోదైన కేసులలో 196 కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా ముగ్గురు వలస కార్మికులు కరోనా భారీన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,698కు చేరగా మృతుల సంఖ్య 82కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: