ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా ప్రభావం రోజురోజుకు ఎక్కువ అవుతుంది. లాక్ డౌన్ విధించిన కూడా దాని తీవ్రత ఎక్కడ తగ్గలేదు. ఈ కరోనా కారణంగా చాలా మంది మృత్యు ఒడిలోకి చేరారు.. కరోనా ప్రభావం రోజు రోజు పెరుగుతుంది.. దాంతో  లాక్ డౌన్ ను విధించారు..లాక్ డౌన్ కఠిన తరంగా మారడంతో అన్నీ రకాల వాణిజ్య వ్యాపారాలు ఎక్కడిక్కడ మూతపడ్డాయి.. అంతేకాదు పెళ్లిళ్లు , సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ ఆగిపోయాయి.. దాంతో నష్టాలు కూడా ఎక్కువగానే వచ్చాయి.. 

 

 

 


సినిమాలు , సీరియల్స్ బంద్ కావడంతో సెలబ్రెటీల ఇళ్లకే పరిమితమయ్యారు..దీంతో కరోనా పై ప్రజలు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.కొందరేమో లాక్ డౌన్ లో వాళ్ళు ఇళ్లలో ఉంటూ ఎం చేస్తున్నారు అనే విషయం అభిమానులతో పంచుకుంటున్నారు.. అసలు విషయానికొస్తే..ఎవరి జీవితంలో అయినా పెళ్లి ఓ మధురానుభూతి. కానీ, కరోనా దెబ్బకు మానవ జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో వివాహం అనేది ప్రాధాన్యత అంశాల క్రమంలో వెనకబడింది.

 

 

 


అయితే తెలంగాణతో పోలిస్తే కరోనా ప్రభావం ఆంధ్రాలో దారుణంగా మారింది అని చెప్పాలి. దాదాపుగా 85 శాతం ప్రాంతాల్లో కరోనా సోకింది. దీంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలను కరోనా నుంచి కాపాడటంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రజలను కరోనా భయం నుంచి  తప్పించడానికి  కొత్త మార్గాలను అమలు చేస్తున్నారు. తాజాగా మరో సారి కరొనకు భయపడవద్దు జాగ్రత్తలు పాటించాలి అంటూ సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు వెంటనే ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని సూచించారు.  సామాజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.  అంతేకాదు జలుబు , దగ్గు ,జ్వరం, జ్వరం ఉన్న వాళ్ళు  వెంటనే నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు తప్పక ఈ సూత్రాలను పాటించి కరొనను నియంత్రణలో సహకరించాలని సీఎం జగన్ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: