ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ ఎప్పటికప్పుడు అధికార పార్టీ అయిన వైసీపీ విధివిధానాలను తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తోంది అన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధివిధానాలపై... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది అంటూ ఆయన విమర్శించారు. సామాన్య ప్రజలు ఎలాంటి ఉపాధి పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  మాత్రం అవన్నీ పట్టడం లేదు   అంటూ ఆయన ఆరోపించారు. ఎవరైనా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతే  వారి పై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఏకంగా అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. 

 


 ప్రభుత్వం ఏం చేసినా ఊరుకోవాలా..?  అప్రజాస్వామిక పనులను ప్రశ్నించకూడదా..?  అంటూ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు కన్న లక్ష్మీనారాయణ. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి సర్కారు హయాంలో రాష్ట్రంలో అప్రజాస్వామికం రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏడాది కాలంలో చేపట్టిన నీటి ప్రాజెక్టులపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేసిన కన్నా లక్ష్మీనారాయణ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జగన్ సర్కార్... పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ విమర్శించారు. 

 

 మూడు రాజధానుల పేరుతో ప్రస్తుతం వైసీపీ నేతలు అందరూ రాజకీయం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు రూపం బయటపడింది అంటు  ఆరోపించిన కన్నా లక్ష్మీనారాయణ... ఎన్నికల ముందు ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన నిజస్వరూపాన్ని చూపిస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కార్ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ జగన్ సర్కార్   దారుణంగా వ్యవహరిస్తోంది అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: