వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న టైం నుండే రాష్ట్రంలో మద్యపానం  అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా  నిషేధించడం జరుగుతుందని హామీ ఇవ్వటం అందరికీ తెలిసిందే. దీంతో అనుకున్నట్టే జగన్ అధికారంలోకి రావడమే మద్యపానం పాలసీని పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. విభజనతో నష్టపోయి ఖజానా కి చిల్లు పడిన మద్యపానం నుండి డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా జగన్ ఈ నిర్ణయం తీసుకోవటం అప్పట్లో పెద్ద హైలెట్. దీంతో జగన్ దశలవారీగా మద్యం షాపులు తగ్గించుకుంటూ వస్తూ గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించారు.

 

అంతేకాకుండా ఉన్న కొద్దీ రేట్లు పెంచేస్తూ షాపుల దగ్గర కూర్చుని తాగే సిట్టింగ్ విధానం లేకుండా, అరికట్టే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారు. మద్యపానం వల్ల రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థ లో ఆడవాళ్లు మరియు పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి దిమ్మతిరిగే విధంగా మందుబాబులు రేట్లు పెంచిన మద్యానికి బదులు నాటుసారా ఎక్కువమంది తీసుకుంటున్నారు. రాష్ట్రంలో నాటుసారా దొరకటంతో అది కూడా తక్కువ రేటుకి కావటంతో చాలామంది మందుబాబులు నాటు సారా వైపు మళ్లుతున్నారు.

 

ఇదే సమయంలో ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో దీన్ని నిరోధించే విషయంలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రాష్ట్రంలో చాలా వరకు సారాయి దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నయి. దీనిపై జగన్ దృష్టి పెట్టకపోతే మద్యపానం రేట్లు పెంచిన షాపులు తగ్గించిన… సారాయి దుకాణాలు వల్ల ఇమేజ్ డామేజ్ అయ్యే అవకాశం ఉందని రాష్ట్రంలో ఉన్న లిక్కర్ మాఫియా ని అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలో నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: