విశాఖ జిల్లా చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీపై సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెరుగుతున్నాయి. వివాద ర‌హితుడిగా పేరున్న ధ‌ర్మ‌శ్రీ ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో ప్ర‌ధాన వార్త‌ల్లో నాయ‌కుడు అయిపో యారు. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రెండు సార్లు ఫెయిలై.. గ‌త ఏడాది ఎట్ట‌కేల‌కు వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు ధ‌ర్మ‌శ్రీ. మంచి వాయిస్‌.. రాజ‌కీయా ల‌పై గ‌ట్టి ప‌ట్టు ఉన్న నాయ‌కుడిగా స్థానికులు ఆయ‌న‌ను పేర్కొంటారు. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి న ఈయ‌న ఓడిపోయారు.

 

ఆ వెంట‌నే జ‌గ‌న్ గూటికి చేరిపోయారు.  ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేశారు. అయి తే, ఆ ద‌ఫా కూడా ఆయ‌న ఓట‌మిపాలై.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గ‌ట్టి ప‌ట్టుప‌ట్టి దాదాపు 27 వేల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇంత గ‌ట్టి మెజారిటీ సాధించిన త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రూ స‌హ‌క‌రించ‌డం లేద‌నేది ధ‌ర్మ‌శ్రీ ఆవేద‌న‌. ఇది ఆది నుంచి ఆయ‌న‌ను ప‌ట్టిపీడిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదైనా కూడా ఆయ‌న ఇక్క‌డి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే, త‌న‌కు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిం చాల‌నే ఉంద‌ని, కానీ, త‌న‌కు అధికారులు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆయ‌న అంటున్నారు.

 

ఇదే విష‌యాన్ని ఆయ‌న ఇటీవ‌ల ఓ మీటింగ్‌లో కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇసుక అక్ర‌మాలు జ‌రుగుతున్నా.. కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో సంబంధం లేని వ్య‌క్తులు చ‌క్రం తిప్పుతున్నా ర‌ని, తాను ఎన్నిసార్లు కంప్ల‌యింట్లు చేసినా కూడా అధికారులు స్పందించ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వెళ్ల‌గ‌క్కారు. దీంతో నిన్న‌మొన్న‌టివ‌ర‌కు కూడా ఆయ‌న‌ను ప‌ట్టించుకోని సోష‌ల్ మీడియా ఇప్పుడు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు కుమ్మ‌రిస్తోంది. సోష‌ల్ మీడియా కామెంట్ల ప్ర‌కారం ధ‌ర్మ‌శ్రీ ఆగ్ర‌హం.. ఓ ఎంపీ స్థాయి కీల‌క నాయ‌కుడిపై ఉంది.

 

అయితే, ఆయ‌న పార్టీలో కీల‌కంగా ఉండ‌డంతో ఏమీ అనే సాహ‌సం చేయ‌లేక పోతున్నార‌ట‌. పైగా విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధాని చేయాల‌నుకున్న త‌ర్వాత‌.. ఇక్క‌డ ఆయ‌న ఆధిప‌త్య‌మే ఎక్కువ‌గా ఉంద‌ట‌. దీంతో ధ‌ర్మ‌శ్రీని అధికారులు లెక్క‌చేయ‌కుండా.. స‌ద‌రు ఎంపీనే తెర‌వెనుక ఉండి చ‌క్రం తిప్పుతున్నార‌ట‌. కానీ, ఈ విష‌యాలు తెలిసి కూడా స‌ద‌రు ఎంపీని ఏమీ అన‌లేక‌.. అధికారుల‌పైనే ప్ర‌తాపం చూపుతున్నార‌న్న‌ది సోష‌ల్ మీడియాలో ధ‌ర్మ‌శ్రీపై వెల్లువెత్తుతున్న కామెంట్లు. మ‌రి ఈయ‌న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక ధ‌ర్మ‌శ్రీ అస‌హ‌నం అంతా విజ‌య‌సామి మీదే అన్న గుస‌గుసలు కూడా విశాఖ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: