ఈ టైంలో జగన్ ఢిల్లీ టూర్ హఠాత్తుగా ఫిక్స్ అయింది. ఇంకా కరోనా ఓ వైపు ఉంది. అది మహమ్మారిలా ఉంది. లాక్ డౌన్ అయిదవ దశ నడుస్తోంది. ఇలాంటి టైంలో జగన్ ఉన్నట్లుండి ఢిల్లీ టూర్ అంటే చాలా ఇంటెరెస్టింగ్ గా కనిపిస్తోంది.

 

నిజానికి ఈ టూర్ ఉంటుందని ఇప్పటికే కొంత ప్రచారం జరిగింది కానీ మరీ జూన్ నెల వస్తూనే జగన్ హస్తిన పయనం అవుతూండడం మాత్రం రాజకీయంగా కలకలం రేపుతోంది. జగన్ ఢిల్లీ టూర్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి.

 

జగన్ కి చాలా పెండింగ్ పనులు ఢిల్లీలో ఉన్నాయని అంటున్నారు. ఆయన నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఇప్పటికైతే ఆయన అప్పాయింట్మెంట్  మాత్రమే ఖరారు అయింది. ఆ తరువాత న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కూడా కలుస్తారు. ప్రధాని అప్పాయింట్మెంట్ కూడా జగన్ అజెండాలో ఉంది.

 

అయితే మోడీతో కలిస్తే మాత్రం ఏపీకి ఆర్ధిక సాయం కోరుతారు. ఇక అమిత్ షాతో శాసనమండలి రద్దుతో పాటు ఈ మధ్య ఏపీలో  చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు వివరిస్తార‌ని అంటున్నారు. ఏపీలో కోర్టు తీర్పులు వరసగా ప్రభుత్వానికి  వ్యతిరేకంగా వస్తున్న సందర్భంలో జగన్ కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కలవనున్నారు.

 

రవిశంకర్ ప్రసాద్ ఈ మధ్యనే జగన్ కి సపోర్టుగా కొన్ని కామెంట్స్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఓడిపోయిన పార్టీలు రాజకీయంగా సాధించండానికి ప్రజా వ్యాజ్యాలను ఉపయోగించుకుంటున్నాయని కూడా రవిశంకర్ ప్రసాద్ అంటున్నారు.

 

అంటే ఆయన ఏపీలో జరుగుతున్న విపక్ష రాజకీయాన్ని బాగానే ఔపాసన పడుతున్నారని అర్ధమవుతోంది. ఆయన కూడా శాసన మండలి రద్దు బిల్లు పార్లమెంట్ లో ఆమోదానికి చొరవ చూపాల్సిఉంది. అందువల్ల జగన్ ఆయన‌తో భేటీ సందర్భంగా అన్ని విషయాలు చర్చిస్తారని అంటున్నారు.

 

ఇక జగన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్తున్నారు అంటే ఆయన ఏదో తాను పట్టుదల పట్టింది సాధించుకోవడానికేనని అంటున్నారు. అది ఏంటన్నది మాత్రం ఇప్పటికైతే ఎవరికీ తెలియదు. జగన్ కూడాబయటకు ఎవరికీ  చెప్పరు. కాలమే దానికి జవాబు చెబుతుంది. అంతవరకూ వేచి  చూడడమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: